
మిస్ వరల్డ్ పోటీలకు అర్హత వయసు 18 నుంచి 26 ఏళ్లు
వ్యక్తిత్వం, సామాజిక బాధ్యత కూడా ప్రాధాన్యం
ఈ అంశాల గురించి ఆరా తీస్తున్న ఫ్యాషన్ ఔత్సాహికులు
నగర వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల గురించి విధితమే. అయితే ప్రతి అంశానికి, కార్యక్రమానికి విధిగా నియమావళి ఉన్నట్లే మిస్ వరల్డ్ పోటీలకు సైతం నియమాలు, అర్హతలు, తదితర అంతర్జాతీయ అంశాలు ఉంటాయి. ప్రస్తుతం జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీల నేపథ్యంలో ఈ పోటీలకు సంబంధించిన నియమాలు, పోటీల్లో పాల్గొనే వారి అర్హతలు తదితర అంశాల గురించి ఆరా తీస్తున్నారు. వీటికి సంబంధించిన వివరాల కోసం గూగుల్‌ను సైతం ఆశ్రయిస్తున్నారు. ఈ సందర్భంగా మిస్ వరల్డ్ పోటీలకు సంబంధించిన నియమావళి.
ప్రపంచ వ్యాప్తంగా ప్రతిష్టాత్మక అందగత్తెల పోటీగా మిస్ వరల్డ్ పరిచయమైంది. మిస్ వరల్డ్ పోటీ అనేది కేవలం అందాన్ని ఆరాధించడమే కాక, వ్యక్తిత్వం, సామాజిక బాధ్యతలు, సామాజిక చైతన్యాన్ని కూడా ప్రోత్సహించే గొప్ప వేదిక. ఇది ప్రతి మహిళకూ తన ప్రతిభను ప్రపంచానికి చూపించేందుకు ఒక గొప్ప అవకాశం కలి్పస్తుంది. 1951లో ప్రారంభమైన ఈ పోటీ ద్వారా.. ప్రతి యేటా వివిధ దేశాల మహిళలు తమ అందం, ప్రతిభ, సామాజిక బాధ్యత, వ్యక్తిత్వం ఆధారంగా ప్రపంచానికి పరిచయమవుతారు. మిస్ వరల్డ్ పోటీని నిర్వహించే ప్రతిపాదనలు, నియమాలు, అర్హతలు, అంతర్జాతీయ అంశాలు విస్తృతంగా ఉంటాయి.
నియమాలు, నిబంధనలు..
మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉంటాయి. మొత్తం 140కు పైగా దేశాలు ఈ పోటీలో ప్రతినిధులను పంపిస్తాయి. ఇందులో ప్రతి దేశం తమ దేశంలో ఎంపిక ప్రక్రియను నిర్వహిస్తుంది, విజేతలు ఎంట్రీ పాసులు పొందుతారు. పోటీలో పాల్గొనడానికి మహిళలు వారి వయసు కనీసం 18 సంవత్సరాలు పూర్తయ్యి ఉండాలి. గరిష్ట వయస్సు 26 సంవత్సరాలు, అంటే
27వ సంవత్సరంలోకి ప్రవేశించే వారు పోటీలో పాల్గొనలేరు.
ఇవే అర్హతలు..
జాతీయత : ప్రతి దేశం తన తరపున ఒక్క మహిళను పంపిస్తుంది. ఆ మహిళ ఆ దేశం సిటిజన్‌గా ఉండాలి.
భాష : అభ్యర్థులు ఆంగ్ల భాషలో మాట్లాడగలిగితే అది వారి పోటీ కోసం అనుకూలంగా ఉంటాయి.
విద్య, సామాజిక బాధ్యత : మహిళలకు సాధారణంగా మంచి విద్య ఉండాలి. అలాగే వారి సామాజిక బాధ్యతలు, సామాజిక సేవా కార్యక్రమాలు కూడా ముఖ్యం.
అంతర్జాతీయ అంశాలు..
మిస్ వరల్డ్ పోటీ కేవలం అందం మాత్రమే కాక, సామాజిక, సాంస్కృతిక, శక్తివంతమైన అంశాలపై దృష్టి సారిస్తుంది. ప్రతి ఏడాది పోటీ ‘బ్యూటీ విత్ పర్పస్’ అనే థీమ్ ఆధారంగా నిర్వహించబడుతుంది. ఇందులో అభ్యర్థులు ప్రపంచవ్యాప్తంగా తమ కమ్యూనిటీలకు సహాయం చేసే విధంగా వనరులను ఉపయోగిస్తారు. వాటిలో విద్య, ఆరోగ్యం, మహిళల హక్కులు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలు ముఖ్యంగా ఉంటాయి.
ప్రత్యేక అంశాలు..
మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడం స్నేహపూర్వక పోటీ మాత్రమే కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పరిచయమవ్వడానికి కూడా ఒక మార్గం. అభ్యర్థులు వివిధ ప్రదర్శనల్లో పాల్గొని, ప్రపంచంలోని వివిధ సాంస్కృతిక నేపథ్యాలను అంగీకరిస్తారు. ఇదే కాకుండా, వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని, సాంకేతికంగా కూడా సమాజానికి అవసరమైన మార్పు తీసుకురావడంలో శక్తిమంతంగా వ్యవహరిస్తారు.