అధ్వానం.. నిర్వహణ ఘోరం
● జిల్లా కేంద్రం ఏలూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్ని రకాల హాస్టళ్లు కలిపి మొత్తం 17 ప్రభుత్వ వసతి గృహాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా హాస్టళ్లలో మెనూ ప్రకారం భోజనాలు పెట్టడం లేదు. విద్యార్థి సంఘాల నాయకులు పరిశీలించేందుకు వెళ్లాలంటే కలెక్టర్ అనుమతితోనే రానిస్తామంటూ హాస్టల్ నిర్వాహకులు తెగేసి చెబుతున్నారు. దీంతో అక్కడ ఉండే విద్యార్థులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు.
● దెందులూరు నియోజకవర్గం కొవ్వలిలోని హాస్టల్‌లో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది. గత వైఎస్సార్‌సీపీ హయాంలో 300 మంది విద్యార్థులు ఉండగా ఇప్పుడు కేవలం 45 మంది మాత్రమే ఉన్నారు. నియోజకవర్గంలోని ఎస్సీ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గింది.
● చింతలపూడి నియోజకవర్గంలోని కొన్ని సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు సరైన వసతులు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు.
● పోలవరంలోని బీసీ బాలుర వసతి గృహం అద్దె భవనంలో నిర్వహిస్తున్నారు. అసలే అద్దె భవనం, అరకొర వసతులతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
● గణపవరంలోని ఎస్సీ బాలుర వసతి గృహంలో ఒక భవనం శిథిలావస్థకు చేరడంతో పాత భవనాన్ని మూసివేశారు.
అధ్వానం.. నిర్వహణ ఘోరం


