అంకిత భావంతో పనిచేయాలి
ఏలూరు టౌన్: జిల్లాలోని ల్యాబ్ టెక్నీషియన్లు రోగుల పట్ల ప్రేమతోనూ, మర్యాదగా నడచుకోవాలనీ, అంకిత భావంతో పనిచేయాలని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పీజే అమృతం అన్నారు. ఏలూరు డీఎంహెచ్‌వో కార్యాలయం సమావేశ మందిరంలో బుధవారం జిల్లాస్థాయి ల్యాబ్ టెక్నీషియన్ల సమావేశం నిర్వహించారు. డీఎంహెచ్‌వో మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లు సమర్థవంతంగా పనిచేయాలన్నారు. బోధకాలు వ్యాధి నివారణకు రాత్రివేళల్లో రక్త పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. జిల్లా మలేరియా అధికారి పీఎస్‌ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ల్యాబ్ టెక్నీషీయన్లు రోగులకు రక్త పరీక్షలు చేసే సమయంలో అశ్రద్ధ చేయకుండా ఖచ్చితమైన ఫలితాలు వచ్చేలా పనిచేయాలనీ, అప్పుడే రోగికి న్యాయం జరుగుతుందన్నారు. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ డాక్టర్ గంగాభవానీ, అసిస్టెంట్ మలేరియా అధికారి జే.గోవిందరావు, పందిరి శ్రీనివాసరావు, పాల్గొన్నారు.


