మేఘాకు ఎక్స్‌లెన్స్ అవార్డు
పోలవరం రూరల్: పోలవరం జల విద్యుత్ కేంద్రం నిర్మాణ పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) 25 మిలియన్ల సేఫ్ మాన్ అవర్స్ ధ్రువపత్రాన్ని సాధించింది. ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టినప్పటి నుంచి ఈ ఏడాది నవంబర్ వరకు ఒక్క పని దినం కూడా వృథా కాకుండా అన్ని రకాల భద్రతా చర్యలు తీసుకుని పని చేసినందుకు ఏపీజెన్‌కో ఈ ధ్రువపత్రాన్ని ఎంఈఐఎల్‌కు అందచేసింది. ఎంఈఐఎల్ అసోసియేట్ మేనేజర్ ప్రగడ నంద నాగ కృష్ణ బుధవారం జెన్‌కో ఎస్‌ఈ కే రామభద్రరాజు నుంచి ఈ ధ్రువపత్రాన్ని అందుకున్నారు. ఎలాంటి ప్రమాదం జరగకుండా కార్మికులు, సిబ్బంది భద్రతకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నట్టు జల విద్యుత్ కేంద్రం ఎంఈఐఎల్ జనరల్ మేనేజర్ ప్రసేన్ జిత్ మజుందార్ , భద్రతా విభాగం ఇన్‌చార్జి సబ్యసాచి రానా తెలిపారు.


