భక్తాంజనేయ గ్రామోత్సవం
వీరవాసరం: నందమూరిగరువు శ్రీ రామ భక్తాంజనేయ స్వామి ఆలయ 60వ వార్షికోత్సవ, హనుమద్ వ్రత మహోత్సవాలు బుధవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 5.45 గంటలకు ఉత్సవాలకు కొప్పినీడి శ్రీనివాసరావు దంపతులు కలశస్థాపన నిర్వహించారు. అనంతరం గ్రామోత్సవం నేత్రపర్వంగా సాగింది. అమ్మవార్ల వేషాలు, బుట్ట బొమ్మల ప్రదర్శన, అయోధ్య రామయ్య ప్రదర్శనలు, అఘోరా నృత్యాలు వంటివి విశేషంగా ఆకట్టుకున్నాయి. బాణసంచా కాల్పులు అలరించాయి.
ఏలూరు రూరల్: ఈ నెల 10వ తేదీ నుంచి 14 వరకూ కాకినాడ జేఎన్‌టీయూ యూనివర్సిటీ ఆవరణలో వైద్య కళాశాలల సౌత్‌జోన్ ఇంటర్ యూనివర్సిటీ పురుషుల వాలీబాల్ పోటీలు జరగనున్నాయని ఆశ్రం మెడికల్ కళాశాల పీడీ వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వాలీబాల్ జట్టు ఎంపిక పోటీలను మంగళవారం ఆశ్రం కళాశాల ఆవరణలో చేపట్టామన్నారు. సెలక్షన్ కమిటీ సభ్యులు ఈ త్రిమూర్తి, కె వెంకటేశ్వరరావు, వీవీఎస్‌ఎం శ్రీనివాసరాజు 14 మంది జట్టు సభ్యలతో పాటు నలుగురు స్టాండ్‌బై ప్లేయర్లతో ఎంపిక పక్రియ పూర్తి చేశారన్నారు. ఆశ్రం ప్రిన్సిపాల్ శ్రీనివాస్ చేబ్రోలు, సీఈఓ కె హనుమంతురావు, వైస్ ప్రిన్సిపాల్ వి శివప్రబోద్ తదితరులు పరిశీలించారని వివరించారు.
కొయ్యలగూడెం: గవరవరం గ్రామంలో పిచ్చికుక్క దాడిలో ఓ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. బుధవారం గ్రామంలో రోడ్డు మీద వెళుతున్న వృద్ధుడిపై పిచ్చికుక్క దాడి చేసింది. తీవ్ర గాయాలపాలైన అతడిని స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వారం వ్యవధిలో సుమారు 50 మంది పిచ్చికుక్క కాటుకు గురయ్యారని స్థానికులు తెలిపారు. పంచాయతీ వెంటనే స్పందించి పిచ్చికుక్కను పట్టుకోవడానికి సత్వర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
భక్తాంజనేయ గ్రామోత్సవం
భక్తాంజనేయ గ్రామోత్సవం


