వేధింపులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు | - | Sakshi
Sakshi News home page

వేధింపులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు

Dec 4 2025 8:39 AM | Updated on Dec 4 2025 8:39 AM

వేధింపులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు

వేధింపులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు

వేధింపులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు

పెనుగొండ: వైఎస్సార్‌సీపీ సర్పంచ్‌లను, ఇతర ప్రజా ప్రతినిధులు, నాయకులను వేధింపులకు గురిచేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైఎస్సార్‌సీపీ అడ్వయిజరీ కమిటీ సభ్యుడు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు హెచ్చరించారు. నియోజకవర్గంలో సర్పంచ్‌లు, వైఎస్సార్‌ సీపీ నాయకులపై విచారణలు, కేసుల పేరుతో కూటమి నాయకులు చేస్తున్న వేధింపు చర్యలపై తూర్పుపాలెంలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం వద్ద బుధవారం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. సర్పంచ్‌లను విచారణల పేరుతో వేధింపులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. లేనిపోని ఫిర్యాదులు చేసి పార్టీ నాయకులను పోలీసుస్టేషన్ల చుట్టూ తిప్పుకుంటున్నారన్నారు. ఇలాంటి చర్యలు మానుకోవాలని హితవు పలికారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆచంట పంచాయతీలో రెండు కోట్లకు పైగా రికవరీ చేయాలంటూ ఆనాటి అధికారులు రిపోర్టు ఇస్తే అప్పుడు ఏమిచేసారంటూ ప్రశ్నించారు. ఎక్కడా అవినీతికి పాల్పడకపోయినా, వోచర్లు మాయం చేసి వేధింపులకు గురి చేస్తున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో అధికార మార్పిడి జరిగిన నాటి నుంచి తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నారన్నారు. ఇళ్ల స్థలాలపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. మార్కెట్‌ ధరలు విపరీతంగా ఉండడంతో ప్రభుత్వ ధర కన్నా అధికంగా కొనుగోలు చేశారన్నారు. దీనికి అనుగుణంగా ఆయా ప్రాంతాల్లో అనువైన చోట్ల కొనుగోలు చేసి స్థలాలు పంపిణీ చేశారని చెప్పారు. దీనిని అవినీతిగా చిత్రీకరించడానికి కూటమి నాయకులు యత్నిస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో ఇళ్ల స్థలాలపై ఎక్కడా ఏ ఒక్కరూ అవినీతికి పాల్పడలేదన్నారు. ఏదోవిధంగా వేధింపులకు గురి చేయడానికి బురద జల్లుతున్నారన్నారు. టీడీపీ హాయాంలోనే మల్లిపూడి లాంటి గ్రామాల్లో ఇళ్ల స్థలాలను ఏటీఎంగా వినియోగించుకొన్నారని విమర్శించారు. వారు చేసిన అవినీతి ఇతరులపై జల్లుతున్నారన్నారు. ఇకపై వేధింపులకు గురి చేస్తే సమష్టిగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. గ్రామాల్లో జరిగే సమావేశాల్లో ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అనాగరిక పదాలు వాడుతున్నారని, హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ కర్రి వాసురెడ్డి, జడ్పీటీసీలు గుంటూరి పెద్దిరాజు, కర్రి గౌరీ సుభాషిణీ వేణుబాబు, వైస్‌ ఎంపీపీ తోలేటి శ్రీను, సర్పంచ్‌లు కోట సరోజనీ వెంకటేశ్వరరావు, సుంకర సీతారామ్‌, జక్కంశెట్టి చంటి, జక్కంశెట్టి శ్రీరాములు, మట్టా కుమారి రాము, బుర్రా రవికుమార్‌లు, పార్టీ ప్రధాన కార్యదర్శి దంపనబోయిన బాబులు, జిల్లా ఎస్సీ సెల్‌ కన్వీనరు చిన్నం ఏడుకొండలు, మండల కన్వీనర్లు నల్లిమిల్లి బాబిరెడ్డి, గూడూరి దేవేంద్రుడు, పిల్లి నాగన్న, పార్టీ నాయకులు చిటికెన బాబీ, కొవ్వూరి చిన్న, సూర్యరెడ్డి, నారాయణ రెడ్డి, పోతూముడి రామచంద్రరావు, చింతపల్లి గురుప్రసాద్‌లు పాల్గొన్నారు.

మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement