అరకమ సస్పెన్షన్లు రద్దు చేయాలి
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఏలూరు ఆర్టీసీ డిపో పరిధిలో నిర్వహిస్తున్న పెట్రోల్ బంకులో కుంభకోణం జరిగిందనే కారణంతో సంబంధం లేని ఉద్యోగులను అక్రమంగా సస్పెండ్ చేయడం ఇతర ఉద్యోగుల్లో అభద్రతాభావాన్ని సృష్టిస్తోందని, అధికారులు తక్షణమే స్పందించి అక్రమ సస్పెన్షన్లు రద్దు చేయాలని ఆర్టీసీ కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఇదే డిమాండ్‌తో ఆర్టీసీ కార్మికులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు బుధవారానికి 10వ రోజుకు చేరాయి. వారు మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు చేస్తున్న ఆందోళనకు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు లభిస్తోందన్నారు. ధర్నాలు చేసినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం స్పందించకపోవడం విచారించదగ్గ విషయమన్నారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): జిల్లాలో 2025–26 విద్యా సంవత్సరానికి వివిధ మండలాల్లో ఖాళీగా ఉన్న అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల్లో నియామకాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్లకు రూ.12,500, సెకండరీ గ్రేడ్ టీచర్లకు రూ.10 వేలు గౌరవ వేతనం అందిస్తామన్నారు. అర్హత ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించి ఈ నెల 5లోపు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఏలూరు నగరంలోని 7వ డివిజన్ మున్సిపల్ ఉర్దూ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ), ఏలూరు మండలంలోని అబుల్ కలాం ఆజాద్ నగరపాలక ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (ఉర్దూ), స్కూల్ అసిస్టెంట్ (లెక్కలు ఉర్దూ), స్కూల్ అసిస్టెంట్ (భౌతికశాస్త్రం ఉర్దూ), కై కలూరు మండలం ఆటపాక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ (సంస్కృతం), కలిదిండి మండలం మట్టగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(హిందీ), నూజివీడు మండలం ముక్కోలుపాడు మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్(జీవ శాస్త్రం) ఖాళీలున్నాయన్నారు.
ఏలూరు(ఆర్‌ఆర్‌పేట): జిల్లా పరిధిలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయాలలోనే వాహనాలకు ఫిట్‌నెస్ రెన్యువల్ చేయాలని జిల్లా ఆటో అండ్ ట్రాలీ డ్రైవర్స్ యూనియన్, సీఐటీయూ నాయకులు సీహెచ్ అమర్ కుమార్, జె.గోపి, సీహెచ్ చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. నగరంలోని ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయంలో ఆర్‌టీఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా పరిధిలోని వాహనాలను ఫిట్‌నెస్ రెన్యువల్ చేసుకునేందుకు ఇతర ప్రాంతాలలోని ఏటీఎస్ సెంటర్లకు వెళ్లాలని ప్రకటించడం సరైనది కాదన్నారు. 100 నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఇతర ప్రాంతాల వెళ్లడం ఇబ్బందులకు గురిచేస్తుందదన్నారు.
దెందులూరు: మార్నింగ్ వాక్ చేస్తున్న వ్యక్తిని మృత్యువు కారు రూపంలో కబళించింది. ఈ ఘటన ఏలూరు రూరల్ మండలం శ్రీపర్రు గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. శ్రీపర్రుకు చెందిన ఘంటసాల రంగరాజు (55), ఇందుకూరి సుబ్బారావులు రోజు మార్నింగ్ వాక్ చేస్తూ ఉంటారు. బుధవారం ఉదయం మార్నింగ్ వాక్ చేసేందుకు ఇంటి నుంచి బయల్దేరారు. మార్నింగ్ వాక్ చేస్తుండగా కై కలూరు నుంచి ఏలూరు వస్తున్న కారు ఢీకొట్టింది. రంగరాజు మృతిచెందగా సుబ్బారావు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదానికి కారణమైన కై కలూరు మండలం భుజబలపట్నంకు చెందిన సుఽధీర్‌రాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అరకమ సస్పెన్షన్లు రద్దు చేయాలి
అరకమ సస్పెన్షన్లు రద్దు చేయాలి


