దివ్యాంగుల్లో ఆత్మస్థైర్యం నింపుదాం
ఏలూరు(మెట్రో): విభిన్న ప్రతిభావంతులలో ఆత్మస్థైర్యాన్ని నింపి వారి అభివృద్ధికి ప్రతి ఒక్కరూ చేయూత నివ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా. ఎం.జె.అభిషేక్ గౌడ పిలుపులినిచ్చారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకలు కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో ఘనంగా నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవకాశం ఇస్తే విభిన్న ప్రతిభావంతులు అన్ని రంగాలలోను తమ ప్రతిభను నిరూపించుకోగలరన్నారు. అన్ని రంగాలలో ప్రోత్సాహం అందించాల్సిన మనందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా నవంబరు 25న నిర్వహించిన విభిన్న ప్రతిభావంతుల క్రీడా పోటీలలో పాల్గొని గెలుపొందిన వారికి బహుమతులను అందించారు. విభిన్న ప్రతిభావంతుల సాధికారతకు కృషి చేస్తున్న స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులను సత్కరించారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి.రామ్‌కుమార్, డీఈఓ వెంకటలక్ష్మమ్మ, సెట్వెల్ సీఈఓ ప్రభాకర్, జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి అజీజ్ పాల్గొన్నారు.


