దివ్యాంగులను ప్రేమతో ఆదరించాలి
కై కలూరు: దివ్యాంగులను జాలితో కాకుండా ప్రేమతో ఆదరించాలని వైఎస్సార్‌సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) చెప్పారు. ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా కై కలూరు పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ దివ్యాంగుల విభాగ అధ్యక్షుడు గోసాల రాజేష్‌ను బుధవారం సన్మానించారు. డీఎన్నార్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి పాలనలో దివ్యాంగులకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించారన్నారు. కార్యక్రమంలో బోయిన సత్యనారాయణ, వడ్లాని పార్థసారథి, ఆకుమర్తి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.


