స.హ. చట్టంపై అవగాహన
ఏలూరు(మెట్రో): తెలుసుకోవడం మీ హక్కు.. చెప్పడం ప్రభుత్వ బాధ్యత అని ఇరిగేషన్ శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ మీదుగా ఇరిగేషన్ అధికారులు సమాచార హక్కు చట్టంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ సీహెచ్ దేవ ప్రకాష్ మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమాలు, సంక్షేమం, అభివృద్ధి పథకాలు తదితర విషయాలను తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ప్రజలు తెలుసుకోవాల్సిన విషయాలను స.హ.చట్టం ద్వారా ప్రశ్నిస్తే, దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి, అధికారులకు ఆయా నిబంధనలకు లోబడి ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఇంజనీర్ పుట్టా ధనుంజయులు, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ శనక్కాయల నరేష్‌కుమార్, నీరు – ప్రగతి సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్రీ వెంకటస్వామి, ఏపీ ఎన్జీవోస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్ పాల్గొన్నారు.


