కొల్లేటికోటలో ఆగని ఆక్రమణలు
దస్తావేజులు పరిశీలించాలి
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఆవరణ సమీపంలో ఆక్రమణలకు అడ్డకట్ట పడటం లేదు. శుక్రవారం మరో ముగ్గురు అక్రమ కట్టడాలకు సిద్ధమయ్యారు. ఆక్రమణలపై ఇప్పటికే గురువారం ‘సాక్షి’లో వచ్చిన కథనంపై కలెక్టర్ వెట్రిసల్వి సీరియస్ అయ్యారు. ఆర్డీవో అచ్చుత అంబారీష్‌ను విచారణ చేయాలని ఆదేశించారు. కై కలూరు తహసీల్దారు రామకృష్ణారావును గురువారం కొల్లేటికోట పంపించారు. ఆయన అక్రమణదారుడితో నిర్మాణాలు ఆపివేయాలని ఆదేశించి వచ్చారు. ప్రభుత్వ ఆదేశాలను ఏ మాత్రం లెక్క చేయకుండా మరో ముగ్గురు శుక్రవారం అక్రమ కట్టడాలకు ప్రయత్నించారు. దీంతో వీఆర్వో రాజారత్నం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. దేవస్థానం సమీపంలో దాదాపు 40 కుటుంబాలు ఆక్రమించాయని అందరినీ తొలగించాలని ఆక్రమణదారులు పోలీసు, రెవెన్యూ వీఆర్వోతో వాదనకు దిగారు. శనివారం అందరూ ఆధారాలతో కై కలూరు తహసీల్దారు కార్యాలయానికి రావాలని వీఆర్వో వారికి చెప్పారు.
సర్వే నంబరు 286లో ఆక్రమణలు
దేవస్థాన సమీపంలో సర్వే నంబరు 286లో 8.68 ఎకరాల భూమి ఉంది. దీనిని 12 సబ్ డివిజన్లగా విభజించారు. రెవెన్యూ రికార్డుల ప్రకారం భీమవరం, ఆకివీడు ప్రాంతాలకు చెందిన మంతెన దుర్గరాజు, పులవర్తి లక్ష్మణస్వామి, కనుమూరి సుబ్బరాజు, సోమరాజు, వేగేశ్న పుల్లంరాజు, గోకరాజు నరసింహరాజు, మంతెన రంగరాజు, కాటూరు చెంచయ్య వంటి తదితరులు హక్కుదారులుగా ఉన్నారు. వీరందురు కొన్నేళ్లుగా భూముల వద్దకు రావడం లేదు. పెద్దింట్లమ్మ దేవస్థానం సమీపంలో ఉండటంతో అమ్మవారి దేవస్థానం వచ్చే భక్తులకు ఉపయోగపడుతుందని భావించారు. ఇదే అదునుగా అనేక మంది ఈ భూములను ఆక్రమించారు. గదులు నిర్మించి ప్రతి ఆదివారం వచ్చే భక్తుల నుంచి రూ.వేలల్లో అద్దెలు వసూలు చేస్తున్నారు. ఆదాయం ఎక్కువగా రావడంతో మిగిలిన వారూ ఆక్రమ నిర్మాణాలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
కొల్లేటికోట దేవస్థానం వద్ద ఆక్రమణల ప్రాంతాన్ని పరిశీలిస్తున్న పోలీసు, రెవెన్యూ సిబ్బంది
కొల్లేటికోటలో శుక్రవారం ఆక్రమణదారులు పాతిన సరిహద్దు రాళ్లు
పోలీసు సిబ్బందికి రెవెన్యూ వీఆర్వో ఫిర్యాదు
సర్వే నంబరు 286లో ఆక్రమణల పర్వం
గతంలో ఆక్రమణలు తొలగించాలని మెలిక
దేవస్థానం సమీపంలో కొందరు భూములకు దస్తావేజులు ఉన్నాయని నమ్మబలుకుతున్నారు. వాస్తవానికి తప్పుడు దస్తావేజులు సృష్టించారనే అనుమానాలు అనేక సంవత్సరాల నుంచి పలువురు వ్యక్తం చేస్తున్నారు. రెవెన్యూ అధికారులు లింకు డాక్యుమెంట్లతో సహా సరిపోల్చి నకిలీ భూమి పత్రాల గుట్టు విప్పాలని పలువురు కోరుతున్నారు.
కొల్లేటికోటలో ఆగని ఆక్రమణలు


