గోవు మృతి చెందిన ప్రాంతంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు | - | Sakshi
Sakshi News home page

గోవు మృతి చెందిన ప్రాంతంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు

Nov 28 2025 8:37 AM | Updated on Nov 28 2025 8:37 AM

గోవు

గోవు మృతి చెందిన ప్రాంతంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు

గోవు మృతి చెందిన ప్రాంతంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు బాలికను వేధిస్తున్న యువకుడిపై కేసు డివైడర్‌ను ఢీకొట్టిన లారీ సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష

ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానం అధికారుల తీరు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ఉందని భక్తులు విమర్శిస్తున్నారు. గోసంరక్షణశాలలోని గిర్‌ జాతికి చెందిన ఆవు వాకింగ్‌ ట్రాక్‌లో తిరుగుతూ బుధవారం ఉదయం సెప్టిక్‌ ట్యాంక్‌లో పడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అధికారులు సెప్టిక్‌ ట్యాంక్‌కు, వాకింగ్‌ ట్రాక్‌కు మధ్య గురువారం ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. ఈ రక్షణ చర్యలు ప్రమాదం జరగక ముందు చేపట్టి ఉంటే ఆవు మృతి చెంది ఉండేది కాదని భక్తులు వాపోతున్నారు. క్షేత్రంలో గో వరుస మరణాలు మంచిది కాదని ఓ పక్క పండితులు చెబుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

కై కలూరు: పెళ్లి చేసుకోపోతే నిన్ను, నీ కుటుంబాన్ని చంపేస్తానని యుతిని బెదిరించిన యువకుడు, అతనికి సహకరించిన తల్లిదండ్రులపై కై కలూరు రూరల్‌ ఎస్సై వి.రాంబాబు గురువారం పోక్సో కేసు నమోదు చేశారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని దొడ్డిపట్ల గ్రామానికి చెందిన బాలిక(17) పదో తరగతి చదవి ఇంటి వద్దే ఉంటుంది. ఏడాది నుంచి కలిదిండి మండలం విభరాంపురం గ్రామానికి చెందిన పామర్తి భార్గవ్‌(22) ప్రేమిస్తున్నానని వేధిస్తున్నాడు. ఈ ఏడాది జూలై 7న దొడ్డిపట్లలో బాలిక ఇంటికి ఎవరూ లేని సమయంలో గోడ దూకి వచ్చాడు. అసభ్యకరంగా ప్రవర్తిస్తే ఆమె కేకలు వేయడంతో పారిపోయాడు. తిరిగి ఈ నెల 23న వివాహం చేసుకోపోతే చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాలిక పోలీసులను ఆశ్రయించింది. యువకుడికి అతని తల్లిదండ్రులు శ్రీనివాసరావు, శివరామలక్ష్మీ సహకరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొంది.

ద్వారకాతిరుమల: ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్‌ చేయబోయిన ఓ లారీ అదుపుతప్పి రోడ్డు మధ్యలోని డివైడర్‌ను వేగంగా ఢీకొట్టింది. ఈ ఘటన మండలంలోని సూర్యచంద్రరావుపేటలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం తణుకుకు చెందిన ఓ లారీ వరంగల్‌ నుంచి తవుడు లోడుతో తణుకు పట్టణానికి వెళుతోంది. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును లారీ ఓవర్‌ టేక్‌ చేయబోయింది. అయితే బస్సు మీదకు రావడంతో లారీ డివైడర్‌ మీదకు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో లారీ ముందు రెండు చక్రాలు విరిగిపోయి, అక్కడే నిలిచిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పిందని అక్కడున్నవారు ఊపిరి పీల్చుకున్నారు.

కలెక్టర్‌ వెట్రిసెల్వి

ఏలూరు(మెట్రో): డిసెంబర్‌ 1న ఉంగుటూరు మండలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఏర్పాట్లపై జిల్లా కలక్టర్‌ కె.వెట్రిసెల్వి అధికారులతో గురువారం టెలీకాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా వెట్రిసెల్వి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు సామాజిక పింఛన్ల పంపిణీ, బంగారు కుటుంబాలను కలిసి, మార్గదర్శకులతో సమావేశమయ్యే అవకాశం ఉందని, అనంతరం బహిరంగ సభలో ప్రసంగించే అవకాశం ఉందన్నారు. గొల్లగూడెం, గోపీనాథపట్నంలలో ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల వద్ద పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. హెలీప్యాడ్‌, సభాస్థలి ప్రాంతాలను అధికారులు పరిశీలించి, ఏర్పాట్లకు అనువైన ప్రాంతాలను గుర్తించి ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని ఆదేశించారు.

గోవు మృతి చెందిన ప్రాంతంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు 1
1/1

గోవు మృతి చెందిన ప్రాంతంలో ఫెన్సింగ్‌ ఏర్పాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement