మేడపాడు హోంకు తరలింపు
పెంటపాడు: బాలికపై సంరక్షురాలి ఘాతుకం అని సాక్షి దినపత్రికలో ప్రచురితమైన వార్తకు ఐసీడీఎస్ జిల్లా అధికారులు స్పందించారు. గణపవరం ప్రాజెక్టు సీడీపీవో టీఎల్ సరస్వతి, భీమవరానికి చెందిన ఐసీపీఎస్ సోషల్ వర్కర్ జేమ్స్ గురువారం బాధితులకు కలిశారు. బాధితురాలు గోండి సంతోషిణినితో పాటు, ఆమె సోదరుడు గొండి విజయ్ కుమార్‌లను సంరక్షుల సమ్మతి మేరకు పాలకొల్లు సమీపంలో ఉన్న మేడపాడులో సీడబ్యూసీ హోమ్కు తరలించారు. వేరే దేశంలో ఉన్న వారి తల్లి జ్యోతిని ఫోన్‌లో సంప్రదించి ఆమె సమ్మతి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పెంటపాడు ఐసీడీఎస్ వర్కర్లు కనకలక్ష్మి, అనురాధ తెలిపారు.
దెందులూరు: వివాహానికి వెళ్తున్న మహిళ మెడలో బంగారు గొలుసును దుండగులు అపహరించారు. దెందులూరు ఎస్సై ఆర్.శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఉంగుటూరు గ్రామానికి చెందిన పిల్ల సత్యవతి వివాహానికి హాజరయ్యేందుకు దెందులూరు మండలం ఉండ్రాజవరం గ్రామానికి వెళ్తుంది. ఈ సత్యవతి మెడలోని రెండు కాసుల బంగారు గొలుసును గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు వచ్చి అపహరించడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై శివాజీ వివరించారు.
మేడపాడు హోంకు తరలింపు


