అక్రమాలను వెలుగులోకి తేవడంతో కక్ష సాధింపు చర్యలు
సాక్షి, టాస్క్‌ఫోర్స్: భీమడోలు మండలం పొలసానిపల్లిలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను వెలుగుల్లోకి తీసుకుని వస్తున్నందున తనపై కక్ష సాధింపు చర్యలు పాల్పడుతున్నారని ఆ గ్రామ మాజీ ఉప సర్పంచ్, వైఎస్సార్ సీపీ నేత అంబటి నాగేంద్రప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గురురవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇటీవల గ్రామంలోని చెరువులోని మట్టి, గ్రావెల్‌ను అమ్ముకుంటున్నారని తాను సంబంధిత అధికారులకు పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేశానని వివరించారు. ఈ నేపథ్యంలో వివిధ శాఖలు విచారణ చేస్తుండడంతో పంచాయతీ పాలకవర్గంలోని ఇద్దరు సభ్యులు బుధవారం తన సొంతింటి శంకుస్థాపన చేయకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. శంకుస్థాపన నిలిపేయడంతో ఆహ్వానించుకున్న బంధువులు, పెద్దలు వెనుతిరిగి వెళ్లిపోయారన్నారు. శంకుస్థాపనను అడ్డుకున్న వారిపై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.


