
వైఎస్సార్ అంతరాత్మ ‘తెలుగు’
చిత్తూరు రూరల్ (కాణిపాకం): దివంగత ముఖ్యమంత్రి డా వై.ఎస్.రాజశేఖరరెడ్డి అంతరాత్మ తెలుగుభాష అని భారతీయ తెలుగు రచయితల సమాఖ్య జాతీయ గౌరవాధ్యక్షులు మర్రిపూడి దేవేంద్రరావు అన్నారు. న గరంలోని సమాఖ్య కార్యాలయంలో ఆదివారం రచయితల సమాఖ్య ఆధ్వర్యంలో ‘తెలుగుభాషాభిమా నం – వైఎస్సార్ అంతరంగం’పై సదస్సు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, తెలుగుభాషకు ప్రాచీనపరంగా తెచ్చిన తెలుగుతల్లి ముద్దుబిడ్డగా వైఎస్సార్ ఖ్యాతికెక్కారని చెప్పారు. పల్లెసోయగాలు ఉట్టిపడే పంచెకట్టుతో తేట తెలుగు నడికారపు పలుకుల పలకరింపులు ఒక్క వైఎస్సార్‌కే దక్కిందన్నారు. సమాఖ్య జిల్లా అధ్యక్షులు తోట గోవిందన్ మాట్లాడుతూ అనితర సాధ్యమైన సేవలను ఆంధ్రావనిలోని ప్రతిగుండె కు చేరవేసిన రాజన్న యుగం చిరస్మరణీయమన్నారు. అనంతరం రాజన్న పరిపాలనపై కవిసమ్మేళనం నిర్వహించారు. 20 మంది రచయితలను, సంఘసే వకులను దేవేంద్రరావు సన్మానించారు. ఈ కార్యక్రమంలో రచయితలు శ్రీరాజు, ఎస్.మునీంద్ర, రమేష్ బాబు, తెలుగు భాషాభిమానులు కోటీశ్వ ర మొదలియార్, డి.రోహిత్, జి.లక్ష్మీపతి, చిట్టిబాబు, భూపతి, ఎం.దినకరన్, రాజేంద్రన్, మురళి పాల్గొన్నారు.