
ఒంటరి ఏనుగు హల్‌చల్
రొంపిచెర్ల : మండలంలోని బండ కిందపల్లె, పెద్దగొట్టిగల్లు పంచాయతీలో శుక్రవారం రాత్రి ఒంటరి ఏనుగు హల్‌చల్ చేసింది. అన్నమ్మయ్య జిల్లా పీలేరు మండలం పూట్టావారిపల్లె నుంచి రాత్రి బయలుదేరి కమోళ్లపల్లె, మటోళ్లపల్లె, బండకిందపల్లె దళిత వా డ రామిరెడ్డిగారిపల్లె వైపు వెళ్లింది. మటోళ్లపల్లె సమీపంలోని గాలి చెరువు వద్ద అర్ధరాత్రి పెద్దగా శబ్దాలు చేసుకుంటూ రావడంతో మామిడి తోటల వద్ద కాపలాగా ఉన్న రెడ్డెప్ప దంపతులు చెట్టు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. హరికృష్ణారెడ్డి మామిడి తోటలో టెంకాయ చెట్టును పెకలించింది. భాస్కర్ రెడ్డి పొలం వద్ద ఉన్న ముళ్ల కంచెను విరిచి బండకిందపల్లె వైపు వెళ్లింది. రొంపిచెర్ల మండల సరిహద్దులోని మామిడి తోటల్లో ఒంటరి ఏనుగు ఉండడంతో రైతులు పరుగులు తీశారు.
హరికృష్ణారెడ్డి మామిడి తోటలో టెంకాయ చెట్టును పెకిలించిన ఏనుగు