
బుధవారం సాయంత్రం యూట్యూబ్ (Youtube) వినియోగించడంలో అంతరాయం ఏర్పడింది. సుమారు 3,20,000 మందికి పైగా ఈ సమస్యను ఎదుర్కొన్నట్లు డౌన్‌డెటెక్టర్ (Downdetector) వెల్లడించింది. దీనిపై సంస్థ స్పందించింది. దీనికి సంబంధించిన ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
వేలాది మంది యూట్యూబ్ మ్యూజిక్, టీవీ సేవలలో సమస్యలు ఉన్నట్లు వెల్లడించారు. 'ఎర్రర్ సంభవించింది, దయచేసి తర్వాత మళ్ళీ ప్రయత్నించండి' వంటి ఎర్రర్ సందేశాలను చూసినట్లు లేదా డెస్క్‌టాప్ & మొబైల్ యాప్‌లు రెండింటిలోనూ ఖాళీ బ్లాక్ స్క్రీన్‌లను చూసినట్లు వినియోగదారులు నివేదించారు.
''మీరు ప్రస్తుతం YouTubeలో వీడియోలను ప్లే చేయలేకపోతే, మేము దాన్ని పరిష్కరిస్తున్నాము! మీ ఓర్పుకు ధన్యవాదాలు'' అంటూ టీమ్ యూట్యూబ్ తన ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది.
యూట్యూబ్ అంతరాయానికి కారణం ఏమిటనే విషయాన్ని కంపెనీ వెల్లడించేలేదు. అయితే దీని పరిష్కారానికి టీమ్ యూట్యూబ్ చురుగ్గా పనిచేస్తోంది. యూట్యూబ్ అంతరాయం యునైటెడ్ స్టేట్స్ అంతటా వినియోగదారులను ప్రభావితం చేసింది. డౌన్‌డెటెక్టర్ నుండి వచ్చిన డేటా ప్రకారం.. న్యూయార్క్, లాస్ ఏంజిల్స్, శాన్ ఫ్రాన్సిస్కో, సీటెల్, ఫీనిక్స్, చికాగో, వాషింగ్టన్, డెట్రాయిట్ వంటి పట్టణ కేంద్రాల నుంచి అత్యధిక సంఖ్యలో నివేదికలు వస్తున్నాయి. ఈ సమస్య అమెరికాలో మాత్రమే కాకుండా.. భారత్, యూరప్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కూడా కూడా తలెత్తిందని సమాచారం.
If you’re not able to play videos on YouTube right now – we’re on it! Thanks for your patience, and you can follow along here for updates: https://t.co/EcPxm09f77
— TeamYouTube (@TeamYouTube) October 16, 2025