షియోమీ నుంచి మరో సరికొత్త ఒఎల్‌ఈడీ టీవి

Xiaomi Teases to Launch a New Mi OLED Display TV - Sakshi

ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ మొబైల్స్ తో పాటు, స్మార్ట్ టీవిల మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. కొద్ది రోజుల క్రితమే రెండు టీవిలను విడుదల చేసిన సంస్థ వచ్చే నెలలో మరో కొత్త ఒఎల్‌ఈడీ డిస్‌ప్లేతో టీవిని మార్కెట్లోకి తీసుకొనిరావాలని యోచిస్తుంది. చైనాకు చెందిన మైక్రో బ్లాగింగ్ సైట్ వీబోలో మి టీవీ లాంచ్‌ను టీజ్ చేయడం ప్రారంభించింది. కొత్తగా తీసుకొనిరాబోయే ఈ మోడల్ టీవి గురించి ఎటువంటి ఖచ్చితమైన సమాచారం లేదు. కానీ ఒక టిప్‌స్టర్ అందించిన వివరాల ప్రకారం.. సంస్థ తర్వాత తరం ఒఎల్‌ఈడీ టీవి కావచ్చునని తెలుస్తుంది.

షియోమీ గత ఏడాది జూలైలో ఎంఐ టివి లక్స్ సిరీస్‌ను ఒఎల్‌ఈడీ డిస్‌ప్లేతో పరిచయం చేసింది. సాదారణంగా షియోమీ దాని ఎంఐ టీవి శ్రేణిలో ఎల్‌ఇడి ప్యానెల్స్‌ను ఉపయోగిస్తుంది. వీబోలోని ఎంఐ టీవీ జనరల్ మేనేజర్ రెండు వేర్వేరు టీవీ సెట్ల చిత్రాలను పంచుకున్నారు. గత ఏడాది సంస్థ తెచ్చిన ఎంఐ టివి లక్స్ 65 అంగుళాల 4కె ఒఎల్‌ఈడీ టీవి ధర సిఎన్ వై 12.999 (సుమారు రూ.1,48,800)గా ఉంది. కంపెనీ తన కొత్త ఒఎల్‌ఈడీ ఎంఐ టీవిని గత ఏడాది ఆఫర్ చేసిన దానికంటే తక్కువ ధరకు తీసుకొస్తుందా అనేది ప్రస్తుతం అస్పష్టంగా ఉంది. దీని ఎప్పుడు విడుదల చేయనున్నారు అనే దాని గురించి కంపెనీ ఎలాంటి వివరాలు ఇవ్వలేదు.

చదవండి: ఎయిర్‌టెల్ 5జీ ఇంటర్నెట్ స్పీడ్ ఎంతో తెలుసా?

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top