
టీవీఎస్ మోటార్ కంపెనీ.. సెప్టెంబర్ 4న 'ఎన్‌టార్క్ 150'ను లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన టీజర్ కూడా విడుదల చేసింది. ఇందులో రాబోయే స్కూటర్ హెడ్‌ల్యాంప్ క్లస్టర్ మాత్రమే కనిపిస్తోంది. ఇది క్వాడ్ ఎల్ఈడీ సెటప్‌తో.. టీ-షేప్ హౌసింగ్‌ను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది.
త్వరలో లాంచ్ కానున్న కొత్త టీవీఎస్ ఎన్‌టార్క్ 150 స్కూటర్.. బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుందని తెలుస్తోంది. కాగా కంపెనీ ఈ స్కూటరుకు సంబంధించిన మెకానికల్ వివరాలను అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. ఇంజిన్ వివరాలు కూడా ప్రస్తుతానికి వెల్లడి కాలేదు.
ఇదీ చదవండి: సుజుకి కీలక ప్రకటన.. 5000 బైకులపై ప్రభావం!
ఇండియన్ మార్కెట్లో టీవీఎస్ ఎన్‌టార్క్ 150 స్కూటర్.. యమహా ఏరోక్స్ 155, హీరో జూమ్ 160 వంటి వాటికి ప్రత్యర్థిగా ఉండనుంది. దీని ధర రూ. 1.25 లక్షల నుంచి రూ. 1.35 లక్షల మధ్య ఉండే అవకాశం ఉందని సమాచారం.