టీసీఎస్‌ ఉద్యోగులకు వేతన పెంపు షురూ | TCS salary hikes on september 2025 | Sakshi
Sakshi News home page

టీసీఎస్‌ ఉద్యోగులకు వేతన పెంపు షురూ

Aug 7 2025 6:34 AM | Updated on Aug 7 2025 8:10 AM

TCS salary hikes on september 2025

సెప్టెంబర్‌ 1 నుంచి అమలు

న్యూఢిల్లీ: టీసీఎస్‌ తన ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది. జూనియర్‌ లెవల్‌ నుంచి మధ్య స్థాయి ఉద్యోగుల వరకు 80 శాతం సిబ్బందికి సెప్టెంబర్‌ 1 నుంచి వేతన పెంపులను అమలు చేయనున్నట్టు సమాచారం ఇచ్చింది.

 ఉద్యోగులకు పంపిన ఈ మెయిల్‌లో టీసీఎస్‌ సీహెచ్‌ఆర్‌వో మిలింద్‌ లక్కడ్, సీహెచ్‌ఆర్‌వోగా నియమితులైన కే సుదీప్‌ తెలిపారు. గ్రేడ్‌ సీ3ఏ, దీనికి సమానమైన అసోసియేట్‌లకు (మొత్తం ఉద్యోగుల్లో 80 శాతం) వేతన సవరణను అమలు చేయనున్నట్టు వెల్లడించారు. 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ఈ సంస్థ ఇటీవలే ప్రకటించడం తెలిసే ఉంటుంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement