
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. గుజరాత్‌లోని హన్సల్పూర్ తయారీ కర్మాగారాన్ని ప్రారంభించడంతో మారుతి సుజుకి భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తిని ప్రారంభించింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, జపాన్ రాయబారి కీచి ఒనో, సుజుకి మోటార్ అధ్యక్షుడు తోషిహిరో సుజుకి.. కంపెనీకి చెందిన ఇతర కార్యనిర్వాహకులు పాల్గొన్నారు.
మారుతి సుజుకి ఈ-విటారా ఉత్పత్తి ప్రారంభం తర్వాత.. సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తోషిహిరో మాట్లాడుతూ.. జపాన్ తయారీదారు రాబోయే ఐదు నుంచి ఆరు సంవత్సరాలలో భారతదేశంలో రూ. 70 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. నాలుగు దశాబ్దాలుగా.. భారతదేశంలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నాము. భారతదేశంతో మేము భాగస్వాములు కావడం గర్వకారణంగా ఉందని అన్నారు. భారతదేశం దార్శినికతకు మద్దతు ఇవ్వడానికి.. వికసిత్ భారత్‌కు దోహదపడటానికి మేము కట్టుబడి ఉన్నామని తోషిహిరో సుజుకి అన్నారు.
సుజుకి మోటార్ కార్పొరేషన్ అధ్యక్షుడు తన ప్రసంగంలో.. కొత్తగా ప్రారంభించిన గుజరాత్ ప్లాంట్ ప్రపంచంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ కేంద్రాలలో ఒకటిగా మారుతుందని, భారతదేశంలోని వినియోగదారులకు సేవలందిస్తుందని అన్నారు. ఈ ప్లాంట్ 1 మిలియన్ యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉందని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: భారత్ నుంచి 100 దేశాలకు!.. ఈ-విటారా ప్రారంభించిన మోదీ
ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి చేసిన మొదటి వాహనం మారుతి సుజుకి ఇ-విటారా, ఇది బ్రాండ్ మొదటి బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం కూడా. ఈ ఎలక్ట్రిక్ కారును జపాన్.. యూరప్‌తో సహా 100కు పైగా దేశాలకు ఎగుమతి చేయనున్నట్లు పేర్కొన్నారు. అంతే కాకుండా మొట్టమొదటి లిథియం-అయాన్ బ్యాటరీ.. ఎలక్ట్రోడ్ స్థాయి స్థానికీకరణతో కూడిన సెల్ ఉత్పత్తి ప్రారంభాన్ని కూడా తోషిహిరో సుజుకి ప్రస్తావించారు.