
గత మూడు రోజుల నుంచి దేశీయ సూచీలు నష్టాలోకి జారుకున్న విషయం తెలిసిందే. నేడు (శుక్రవారం దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలతో ప్రారంభమయ్యాయి. గత మూడు రోజుల నుంచి సూచీలు లాభాలతో ప్రారంభమవుతూ...ట్రేడింగ్ ముగిసే సమయానికి భారీ నష్టాలను ముట్టగట్టుకున్నాయి. కాగా బీఎస్‌ఈ సెన్సెక్స్ ఉదయం 10: 20 గంటల సమయానికి 392 పాయింట్లు లాభపడి 61316.29 వద్ద ట్రేడ్ అవుతోంది. నిఫ్టీ కూడా 81 మేర పాయింట్లు లాభపడి 18259.90 వద్ద కొనసాగుతోంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.83 వద్ద ట్రేడవుతోంది.
ఆసియా మార్కెట్లన్నీ సానూకూలంగా ఉండడంతో సూచీలు లాభాల్లోకి వెళ్లాయి. హెచ్‌డీఎఫ్‌సీ, టెక్ మహీంద్రా, టైటన్, పవర్‌గ్రిడ్, బజాజ్ ఆటో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్, రిలయన్స్, భారతీ ఎయిర్‌టెల్, టీసీఎస్, బజాజ్ ఫిన్‌సర్వ్, సన్‌ఫార్మా షేర్లు లాభాల్లో ఉన్నాయి. ఏషియన్ పెయింట్స్, ఎన్‌టీపీసీ, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఐటీసీ, టాటా స్టీల్, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫినాన్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.