
పండుగ సీజన్ సందర్భంగా.. కన్జూమర్ ఎల్రక్టానిక్స్ దిగ్గజం శాంసంగ్ తాజాగా తమ గెలాక్సీ ‘ఏ’ సిరీస్ స్మార్ట్‌ఫోన్లను విస్తరించింది. ఇందులో భాగంగానే 5జీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలు గల ఏ17ని ఆవిష్కరించింది. దీని ధరలు రూ. 18,999 నుంచి రూ. 23,499గా ఉన్నాయి.
హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ కార్డులు, యూపీఐ ద్వారా రూ. 1,000 వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుందని సంస్థ వైస్ ప్రెసిడెంట్ ఆదిత్య బబ్బర్ తెలిపారు. ఈ విభాగంలో అత్యంత పల్చని, తేలికైన ఫోన్ ఇదేనని ఆయన చెప్పారు. 6.7 అంగుళాల ఫుల్ హెచ్‌డీప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, ఎక్సినోస్ ప్రాసెసర్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా, 14 ప్రాంతీయ భాషల్లో జెమినీ లైవ్ సపోర్ట్ తదితర ప్రత్యేకతలు ఇందులో ఉంటాయని ఆదిత్య వివరించారు.
6 జనరేషన్స్ వరకు ఆండ్రాయిడ్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్ ఆఫర్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది ఆఖరు నాటికి పది కోట్ల ‘ఏ’ సిరీస్ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు సాధించాలని నిర్దేశించుకున్నట్లు, ఇప్పటివరకు 9.7 కోట్లు విక్రయించినట్లు ఆయన పేర్కొన్నారు.