హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీనానికి ఊరట.. ఆ విషయాల్లో ఉపశమనం కల్పించిన ఆర్‌బీఐ

RBI gives HDFC Bank selective regulatory relief post HDFC merger - Sakshi

ముంబై: మాతృసంస్థ హెచ్‌డీఎఫ్‌సీతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ విలీనానికి ముందు కొంత ఊరట లభించింది. కొన్ని అంశాల్లో ఆర్‌బీఐ స్వేచ్ఛను కల్పించగా, కొన్నింటి విషయంలో ఉపశమనం కల్పించేందుకు నిరాకరించింది. రెండు సంస్థల విలీనం జూలై నాటికి పూర్తవుతుందని అంచనా. తాము దరఖాస్తు చేసిన కొన్ని అంశాల్లో ఆర్‌బీఐ నుంచి సమాచారం వచ్చిందని, మరికొన్ని అంశాలు పరిష్కృతం కావాల్సి ఉందని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ప్రకటించింది.

ఇదీ చదవండి: దేశంలో తొలి లిథియం బ్యాటరీ ప్లాంటు షురూ

నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్‌ఆర్‌), స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో (ఎస్‌ఎల్‌ఆర్‌) విషయంలో వెసులుబాట్లకు ఆర్‌బీఐ తిరస్కరించింది. ప్రాధాన్య రంగాలకు రుణాలు (పీఎస్‌ఎల్‌), పెట్టుబడుల విషయంలో మాత్రం ఉపశమనం కల్పించింది. విలీనం తేదీ నుంచి సీఆర్‌ఆర్, ఎస్‌ఎల్‌ఆర్, ఎల్‌సీఆర్‌ను నిబంధనలకు అనుగుణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ నిర్వహించాల్సి ఉంటుంది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీ, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ తదితర సంస్థలు ప్రస్తుతం హెచ్‌డీఎఫ్‌సీ అనుబంధ సంస్థలు (సబ్సిడరీలు)గా ఉండగా.. విలీనం తర్వాత ఇవి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ సబ్సిడరీలుగా కొనసాగేందుకు ఆర్‌బీఐ అనుమతించింది.

విలీనానికి ముందే హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్‌ ఇన్సూరెన్స్, హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో జనరల్‌ ఇన్సూరెన్స్‌లో వాటాని హెచ్‌డీఎఫ్‌సీ లేదా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ 50 శాతానికి పైగా పెంచుకోవచ్చు. ఉన్నత విద్యకు రుణాలు అందించే హెచ్‌డీఎఫ్‌సీ క్రెడాలియా ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌లో నూరు శాతం వాటా హెచ్‌డీఎఫ్‌సీకి ఉంది. రెండేళ్లలో ఈ వాటాని 10 శాతానికి హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు తగ్గించుకోవాలి. కొత్త కస్టమర్లను తీసుకోవడాన్ని నిలిపివేయాల్సి ఉంటుంది.

ఇదీ చదవండి: బిర్యానీ అమ్ముతూ రోజుకు రూ.37 లక్షలు సంపాదిస్తున్నాడు.. ఫుడీ ఐఐటీయన్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top