ప్రేమలో విఫలమయ్యారా? లవ్‌ బ్రేకప్‌కి ఓ ఇన్సూరెన్స్‌ ఉందని మీకు తెలుసా?

Prateek Aryan Earn Rs 25,000 After A Breakup With Heartbreak Insurance Fund - Sakshi

కోవిడ్‌-19తో ప్రపంచ వ్యాప్తంగా ఇన్సూరెన్స్‌ రంగం గణనీయమైన వృద్దిని సాధించింది. ఆపత్కాలంలో ఆర్ధిక చేయూత అందించేందుకు భీమా రంగ సంస్థలు ఇన్సూరెన్స్‌ పథకాల్ని అందుబాటులోకి తెస్తున్నాయి. వాటిల్లో హోమ్‌ ఇన్సూరెన్స్‌, మోటార్స్‌ ఇన్సూరెన్స్‌, ట్రావెల్‌ ఇన్సూరెన్స్‌, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇలా రకరకాల ఇన్సూరెన్స్‌లు ఉన్నాయి. కానీ లవ్‌లో బ్రేకప్‌ అయితే ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు ‘హార్ట్‌ బ్రేక్‌ ఇన్సూరెన్స్‌ ఫండ్‌’ అనే పథకం ఉంది. ఆ స్కీమ్‌ గురించి మీకు తెలుసా? 

అవును! ప్రేమికుడు, ప్రేమికురాలు కొన్ని అన్వేక కారణాలతో  విడిపోతున్న ఘటనలు చూసే ఉంటాం. ఇలా విడిపోయిన తర్వాత డబ్బు పరంగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఆదుకునేందుకు పలు ఇన్సూరెన్స్‌  సంస్థలు పథకాల్ని అందిస్తున్నాయి. వాటిల్లో ఈ హార్ట్‌ బ్రేక్‌ ఇన్సూరెన్స్‌ ఒకటి.  

ఇటీవల ప్రతీక్‌ ఆర‍్యన్‌ అనే ట్విటర్‌ యూజర్‌ ప్రేమలో ఉన్నప్పుడు తన ప్రియురాలితో ఓ ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఆ ఒప్పందంలో భాగంగా.. ప్రేమించుకునే సమయంలో పొరపాటున విడిపోతే.. ఎవరికి ఎలాంటి ఆర్ధిక ఇబ్బందులు లేకుండా ఉండేలా ‘హార్ట్ బ్రేక్ ఇన్సూరెన్స్ ఫండ్’ పేరుతో ప్రేమలో మోసపోయిన వాళ్లు డబ్బులు తీసుకోవాలనే నిబంధన పెట్టుకున్నారు. ఇందుకోసం ప్రతీక్‌ అతని ప్రియురాలు కలిసి ఓ బ్యాంక్‌లో జాయింట్‌ అకౌంట్‌ ఓపెన్‌ చేశారు. ప్రతి నెల ఆ అకౌంట్‌లో రూ.1000 డిపాజిట్‌ చేశారు. ఈ తరుణంలో ప్రియురాలు  తనని మోసం చేయడంతో రూ.25వేలు నగదు పొందినట్లు ప్రతీక్‌ ట్వీట్‌లో తెలిపారు.

ప్రతీక్‌ ట్వీట్‌లపై ఈ తరహా ఇన్సూరెన్స్‌లు ఉన్నాయా? అని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇన్సూరెన్స్‌ గురించి పూర్తి వివరాలు చెబితే తాము సైతం పాలసీలు తీసుకుంటామని రీట్వీట్‌లతో హోరెత్తిస్తున్నారు.

లోరెంజో చాన్ ఏం చెబుతున్నారంటే
ప్రేమ విఫలమై డిప్రెషన్‌, అనారోగ్య సమస్యలు, ఆర్ధిక ఇబ్బందులు తలెత్తే వారిని ఆదుకునేందుకు పయనీర్‌ ఇన్సూరెన్స్‌ వంటి సంస్థలు ప్రేమలో విఫలమైన వారి కోసం ఇన్సూరెన్స్‌ స్కీంలను అందిస్తున్నాయి. ఈ పాలసీలు తీసుకున్న వాళ్లు ప్రేమలో విఫలమైన తర్వాత క‍్లయిమ్‌ చేసుకొని నగదు పొందే అవకాశం కల్పిస్తున్నాయి. అలా లబ్ధి పొందాలంటే తాము విధించిన నిబంధనలు లోబడి ఇన్సూరెన్స్‌ తీసుకోవాలని పయనీర్‌ ఇన్సూరెన్స్‌ సంస్థ ప్రెసిడెంట్‌ లోరెంజో చాన్ తెలిపారు.

చదవండి👉 ఎస్‌బీఐ అకౌంట్ బ్రాంచ్ మారాలనుకుంటున్నారా? ఇంట్లో కూర్చొని

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top