పోయిందనుకున్న స్కూటర్ పట్టించింది - ఓలా ఫీచర్.. అదిరిపోలా!

Ola scooter owner thanks ola electric for helping cops track scooter - Sakshi

దేశీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ స్కూటర్లలో 'ఓలా' ఒకటి. ఈ కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్లు ప్రారంభంలో కొన్ని సమస్యలకు గురైనప్పటికీ, ప్రస్తుతం మంచి సంఖ్యలో అమ్మకాలను పొందుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఇందులో ఉన్న అప్డేటెడ్ ఫీచర్స్ అనే చెప్పాలి. ఇందులో ఆ ఫీచర్స్ ఇటీవల దొంగతనం సమయంలో కూడా గుర్తించడానికి సహాయపడ్డాయి.

నివేదికల ప్రకారం, జోధ్‌పూర్ ప్రాంతానికి చెందిన 'అంజలి పాల్' అనే మహిళ ఓలా స్కూటర్‌‌ను గుర్తుతెలియని దుండగులు దొంగలించి ప్యాకర్స్ అండ్ మూవర్స్ సహాయంతో వేరే నగరానికి పంపించాలి నిర్చియించుకుని దానిని పూర్తిగా ప్యాక్ చేసి ఉంచారు. అయితే స్కూటర్ పోగొట్టుకున్న అంజలి తన ఎలక్ట్రిక్ స్కూటర్లోని జిపిఎస్ నావిగేషన్ ద్వారా పోలీసుల సహాయంతో పట్టుకుంది.

స్కూటర్ దొంగిలించబడిన తర్వాత అది ఎక్కడ ఉందో కనిపెట్టడానికి ఓనర్ లొకేషన్ ట్రాకింగ్ ఫీచర్‌ ఉపయోగించుకోవచ్చు. ఈ విధంగానే అంజలి పాల్ తన స్కూటర్ కనిపెట్టగలిగింది. దీనికి కంపెనీ కూడా సహాయం చేసినట్లు తెలుస్తోంది. జోధ్‌పూర్‌కు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైపూర్‌లో ఈ స్కూటర్‌ను స్వాధీనం చేసుకున్నారు.

ఓలా ఎలక్ట్రిక్ తమ ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఆధునిక ఫీచర్స్ అందిస్తుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిజానికి దొంగల భారీ నుంచి రక్షించుకోవడానికి కార్లలో, బైకులలో యాంటీ తెఫ్ట్ అలారం వంటివి అందిస్తారు. దీనితో పాటు నావిగేషన్ అందుబాటులో ఉన్నప్పుడు దొంగతనం జరిగిన తర్వాత కూడా కనిపెట్టడానికి సహాయపడుతుంది.

(ఇదీ చదవండి: Boult Rover Pro: కేవలం రూ. 2499కే స్మార్ట్‌వాచ్: లేటెస్ట్ డిజైన్ & అంతకు మించిన ఫీచర్స్)

లేటెస్ట్ వాహనాల్లో యాంటీ-థెఫ్ట్ అలారం వంటి ఫీచర్స్ అందుబాటులో ఉన్నప్పటికీ దొంగిలించడానికి దొంగలు కూడా అధునాతన సాధనాలను ఉపయోగిస్తున్నారు. అలాంటి సమయంలో దొంగతనాలకు చెక్ పెట్టడానికి స్టీరింగ్ లాక్స్, గేర్ లాక్స్, వీల్ లాక్స్ & జిపిఎస్ ట్రాకర్స్ చాలా ఉపయోగాడతాయి.

(ఇదీ చదవండి: సి3 కొత్త వేరియంట్ లాంచ్ చేసిన సిట్రోయెన్ - ధర ఎంతంటే?)

గతంలో కూడా జిపిఎస్ లొకేషన్ అండ్ టెక్నాలజీ ద్వారా అనేక హై ఎండ్ కార్లు రికవరీ చేసిన సంఘటనలు వెలుగులోకి వచ్చాయి. అయితే ప్రస్తుతం ఓలా వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు అలాంటి ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల మాత్రమే పోయిన స్కూటర్ మళ్ళీ పొందగలిగారు. ఇది నిజంగా కంపెనీ కస్టమర్లకు అందించిన వరమనే చెప్పాలి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top