ఓలా ఈవీ బైక్‌ విడుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు

Ola E-scooter Launch Date To Be Announced Soon  - Sakshi

వరల్డ్‌ వైడ్‌గా ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే  ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ గురించి వస్తున్న వార్తలు బైక్‌ లవర్స్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.  కొద్దిరోజుల క్రితం ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ బెంగళూరు రోడ్లపై చక్కెర్లు కొట్టిన ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ వీడియోల్ని షేర్‌ చేశారు. అదిగో అప్పటి నుంచి ఓలా ఈవీ టూవీలర్‌ స్పీడ్‌ ఎంత? ఎంత మైలేజ్‌ ఇస్తుంది. దాని ఫీచర్లేంటో తెలుసుకునే పనిలో పడ్డారు ఔత్సాహికులు. 

అయితే వారి ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తూ భవిష్‌ అగర్వాల్‌ బైక్‌ గురించి ట్వీట్‌ చేస్తున్నారు. తాజాగా ఈ బైక్‌ ఎప్పుడొస్తుందో చెప్పే ప్రయత్నం చేశారు. సరదాగా టీ తాగుతూ ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ పై ట్వీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.'త్వరలోనే బైక్‌ లాంఛ్‌ డేట్‌ ను అనౌన్స్‌ చేస్తాం వెయిట్‌ చేయండి' అని పేర్కొన్నాడు.

అంతేకాదు మీ బైక్‌ ను ఎలా కొనాలని అనుకుంటున్నారు? అంటూ రెండు ఆప్షన్‌లు ఇచ్చారు భవిష్‌ అగర్వాల్‌ . అందులో ఒకటి ఆన్‌లైన్‌ హోం డెలివరీ కాగా రెండో ఆప్షన్‌ ఫిజికల్‌ డీలర్‌ షిప్‌/ స‍్టోర్‌ లో కొనుగోలు చేయాలని అనుకుంటున‍్నారా అని ప్రశ్నించారు. భవిష్‌ ట్వీట‍్లపై స్పందించిన నెటిజన్లు ఆన్‌ లైన్‌ హోం డెలివరీ కావాలని అడుగుతుండగా.. వారిలో ఎక్కువ మంది ఫ్యూయల్‌ బైక్‌ పై ఎక్సేంజ్‌ ఆఫర్‌ లో ఓలా ఈవీ బైక్‌ ను అందించాలని కోరుతున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top