Businessman Anand Mahindra Shares Fascinating Video Check Here - Sakshi
Sakshi News home page

నాకు ఇది ముందే ఎందుకు కనిపించలేదబ్బా: ఆనంద్‌ మహీంద్ర

Mar 2 2023 5:04 PM | Updated on Mar 2 2023 5:29 PM

Businessman Anand Mahindra Shares Fascinating video check here - Sakshi

సాక్షి,ముంబై: ప్రముఖ పారిశశ్రామికవేత్త, మహీంద్ర అండ్‌ మహీంద్ర అధినేత ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో గురువారం మరో  ఆసక్తికరమైన వీడియోను షేర్‌ చేశారు. సాధారణంగా ఇంట్లో బట్టలు ఉతికిన తరువాత మడతపెట్టి బీరువాలోనో,కప్‌బోర్డ్‌లోనే సర్దడం అనేది ఒక పెద్ద టాస్క్‌. అందులోనూ ఏదైనా ఊరికి వెళ్లేటపుడు తక్కువప్లేస్‌లో ఎక్కువ లగేజీ సర్దడం అంటే నిజంగా బిగ్గెస్ట్‌ టాస్క్‌. ఈ విషయానికి  సంబంధించిన వీడియోనే ఆనంద్‌ మహీంద్ర  తన ఫాలోయర్లతో షేర్‌ చేశారు.

పొందికగా, అందంగా దుస్తులను మడతపెట్టుతున్న ఈ వీడీయో ఆనంద్‌ మహీంద్రను బాగా ఆకర్షించింది. సాధారణంగా చేసుకునే పనులలో సింపుల్‌ టెక్నిక్స్‌ కొ​త్త ఇన్నోవేషన్ & డిజైన్ నైపుణ్యాలు ఆవిష్కారానికి నాంది పలుకుతాయి. ఈ వీడియో చాలా ఫ్యాసినేటింగ్‌ ఉంది అంటూ కొనియాడారు. దశాబ్దాలుగా ప్యాకింగ్‌ల మీద ప్యాకింగ్‌లు చేసుకుంటూ ప్రపంచమంతా కలియదిరుగుతున్న తనకు ముందే ఈ వీడియో ఎందుకు కనిపించలేదంటూ ఫన్నీగా కమెంట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement