పన్నుల హేతుబద్ధీకరణ ప్రధాన అంశంగా 56వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం సెప్టెంబర్ 3న ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఇప్పటికే న్యూదిల్లీలోని తమిళనాడు భవన్‌లో ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సమావేశమయ్యారు. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చించినట్లు తెలిసింది. ఈ సమావేశంలో కర్ణాటక, తెలంగాణ, కేరళ, తమిళనాడు, పంజాబ్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్ రాష్ట్రాల ఆర్థిక మంత్రులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీ శ్లాబులకు క్రమబద్ధీకరించి మొత్తంగా 5, 18, 40 శాతంగా ఉంచాలనే ప్రతిపాదనలున్నాయి. అయితే ఒకవేళ ప్రభుత్వం యోచిస్తున్నట్లు ఈ విధానం అమల్లోకి వస్తే కింది విభాగాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉందని అంచనా.
| ప్రస్తుతం(శాతం) | కొత్త ప్రతిపాదన(శాతం) | |
|---|---|---|
| టెక్స్‌టైల్స్ | 12 | 5 |
| ఫుట్‌వేర్ | 12 | 5 |
| ట్రాక్టర్లు | 12 | 5 |
| ఎయిర్ కండిషనర్లు | 28 | 18 |
| టీవీలు | 28 | 18 |
| సిమెంటు | 28 | 18 |
| పొగాకు ఉత్పత్తులు | 28 | 40 |
| ఎనర్జీ డ్రింక్స్ | 28 | 40 |
| 1500 సీసీ లగ్జరీకార్లు | 28 | 40 |
| హై ఎండ్ మోటార్ సైకిళ్లు | 28 | 40 |
| పాన్ మసాలా | 28 | 40 |
| కొన్ని రకాల బ్రేవరేజస్ | 28 | 40 |
ఇదీ చదవండి: ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల వాదనకు ఎస్‌బీఐ కౌంటర్


