
వైఎస్సార్‌సీపీ నేతలపై దాడులను సహించం
చుండూరు(వేమూరు): వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు చేసినా, వారి గురించి అసభ్యకరంగా మాట్లాడినా సహించబోమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు హెచ్చరించారు. చుండూరు మండలంలోని మోదుకూరు గ్రామంలో బుధవారం రాత్రి వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు అనపు రెడ్డి రఘురామి రెడ్డి ఇంటిపై రాళ్లు విసిరి విచక్షణరహితంగా కొందరు ప్రవర్తించారన్నారు. రఘురామి రెడ్డి ఇంటికి గురువారం ఆయన వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మోదుకూరు గ్రామంలో గంజాయి విక్రయాలు కొనసాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు. గంజాయి తాగి వైఎస్సార్‌సీపీ నాయకులపై కొందరు దాడులు చేసేందుకు యత్నిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌సీపీ నాయకుల ఇళ్లపై రాళ్లు వేస్తున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కులాల మధ్య చిచ్చు పెట్టాలనే ఆలోచనలను వీడి, అందరూ కలిసి ఉండాలని కోరారు. తప్పు ఎవరు చేసినా అది తప్పేనని తెలిపారు. తప్పులను కప్పి పుచ్చుకునేందుకు కులం అనే ముసుగు వేయకూడదని సూచించారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా చర్యలు తీసుకోవాని కోరారు. రఘురామి రెడ్డి ఇంటిపై రెండు సార్లు దాడులు చేయడాన్ని ఖండించారు. వైఎస్సార్‌సీపీ నాయకులపై దాడులు చేస్తే ఊరుకోబోమని చెప్పారు. నిరసనగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పలువురు వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు మండల పార్టీ అధ్యక్షుడి ఇంటిపై రాళ్లు విసిరిన దుండగులు సంఘటన స్థలం పరిశీలన అనంతరం బాధితుడికి అశోక్‌బాబు పరామర్శ