
పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు
అద్దంకి: ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసే పచ్చి అబద్ధాల కోరు చంద్రబాబు నాయుడు అని వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుకు తెచ్చే కార్యక్రమాన్ని అద్దంకిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ, పార్టీ పరిశీలకులు తూమాటి మాధవరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ చంద్రబాబు ఎన్నికలకు ముందు గిట్టుబాటు ధర అన్నారని.. ఏ పంటకు గిట్టుబాటు ధర ఇచ్చింది లేదన్నారు. మిర్చి రైతు నట్టేట మునిగాడన్నారు. పొగాకు రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉందన్నారు. వరి రైతు ఉరివేసుకునే పరిస్థితి ఉందన్నారు. అన్నివర్గాలను చంద్రబాబు మోసం చేశారన్నారు. అనంతరం చంద్రబాబు మోసాలను తెలియజేసే క్యూ ఆర్ కోడ్ కలిగిన ప్రచార పత్రాన్ని ఆవిష్కరించారు. పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు జ్యోతి హనుమంతరావు, పట్టణ అధ్యక్షుడు కాకాని రాధాకృష్ణమూర్తి, రాష్ట్ర ప్రచార విభాగం నాయకుడు పులికం కోటిరెడ్డి, బల్లికురవ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు, పాలపర్తి శ్రీధర్, కె.శ్రీవిద్య, సంతమాగులూరు జెడ్పీటీసీ అడవి శ్రీను, కొల్లా భువనేశ్వరి, మాకినేని శ్రీనివాసరావు, బాజీవలి, మురహరి యాదవ్, రఘురామగుప్తా, ఓబుల్ రెడ్డి తదితర నాయకులు మాట్లాడారు. జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఈదా శ్రీనివాసరెడ్డి, సంతమాగులూరు మండల కన్వీనర్ వూట్ల నాగేశ్వరరావు, ఓబులరెడ్డి, కాశీదేవి, రాష్ట్ర ప్రచార కమిటీ నాయకుడు కోయి అంకారావు, ముత్తవరపు రమణయ్య, బాబూ, ఊడత్తు సురేశ్, బి.మధు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
కుట్రలతోనే కూటమి అధికారం
: ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు
ఒంటిగా పోటీ చేస్తే వైఎస్ జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోతామని గ్రహించిన చంద్రబాబు అండ్ కో కూటమి కట్టి కుట్ర లతో గెలిచారని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు అన్నారు. కూటమి నేతలు అక్రమార్జనకే సమయం సరిపోతుందని, ప్రజల గురించి వారికి పట్టదన్నారు.
నమ్మించి మోసం చేసిన చంద్రబాబు
: పానెం చిన హనిమిరెడ్డి
పార్టీలో అక్కడా.. ఇక్కడా నాటకాలాడే నాయకులను తాను నమ్మనని నియోజవర్గ ఇన్‌చార్జి పానెం చిన హనిమిరెడ్డి అన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీల పేరిట ప్రజలను నమ్మించి మోసం చేశాడన్నారు. హామీల అమలుపై ప్రశ్నించిన నాయకులు, కార్యకర్తలపై కేసులు పెట్టి భయకంపితులను చేస్తున్నారని, వాటికి ఎవరూ భయపడవద్దన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి తప్పక గుర్తింపు ఉంటుందన్నారు.
కూటమి సర్కారు వైఫల్యాలను ఇంటింటికి తీసుకెళదాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మేరుగ నాగార్జున అద్దంకిలో ‘బాబు ష్యూరిటీ –మోసం గ్యారెంటీ’ నియోజకవర్గ కార్యక్రమం పాల్గొన్న ఎమ్మెల్సీ మాధవరావు, నియోజకవర్గ సమన్వయకర్త చిన హనిమిరెడ్డి