
ఇంటింటికి చంద్రబాబు మోసాలు
రేపల్లె: అధికారం కోసం మోసపూరిత హామీలివ్వటం, ప్రజలను మోసగించటం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్యని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున పేర్కొన్నారు. చెరుకుపల్లి మండలం గుళ్ళపల్లిలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం జరిగిన బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ, రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో అంశంపై జరిగిన నియోజకవర్గ స్థాయి సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు తన స్వార్ధం కోసం తప్ప ప్రజలను, రాష్ట్ర ప్రయోజనాలను పట్టించుకోరన్నారు. మేనిఫెస్టోను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పవిత్ర గ్రంథంలా భావిస్తే చంద్రబాబు చిత్తు పేపరులా చెత్తకుండీలో పడవేశారన్నారు. హామీలు అమలు చేయకుండానే అమలు చేసేశాం, సూపర్ సిక్స్‌పై ప్రశ్నించే వారి నాలుక కట్ చేస్తామని చంద్రబాబు అనటం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. ఏ హామీలు అమలు చేశారో బహిరంగంగా ప్రజలకు తెలియజెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామీలు అమలు చేసేంత వరకు వైఎస్సార్ సీపీ ఇంటింటికి చంద్రబాబు మోసాలను తీసుకెళుతుందన్నారు.
ఏడాదిలోనే తీవ్ర ప్రజా వ్యతిరేకత
: డాక్టర్ ఈవూరు గణేష్
సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్ సీపీ రేపల్లె నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఈవూరు గణేష్ మాట్లాడుతూ సంవత్సర కాలంలోనే కూటమి ప్రభుత్వం తీవ్ర ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు. ప్రతిపక్ష నాయకులపై దాడులు, ప్రజలపై అక్రమ కేసులు తప్ప సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిందేమీలేదన్నారు. దొంగ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన విధానంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపును ప్రతి ఒక్కరూ శిరసా వహించాలన్నారు. ఎన్నికల ముందు టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టో పత్రాలను ప్రజలకు గుర్తు చేస్తూ ఇంటింటికి అందించాలన్నారు. ఈ సందర్భంగా బాబు షూరిటీ – మోసం గ్యారెంటీ క్యూఆర్ కోడ్ కరపత్రాలను ఆవిష్కరించారు. సమావేశంలో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త వరికూటి అశోక్‌బాబు, మండల సమన్వయకర్తలు కరేటి శేషగిరిరావు, మేడికొండ అనిల్, యార్లగడ్డ వెంకట రాంబాబు, ఇంకొల్లు రామకృష్ణ, డుండి వెంకట రామిరెడ్డి, నాయకులు యార్లగడ్డ మదన్‌మోహన్, కాటూరి శివనాగబాబు, చదలవాడ శ్రీనివాసరావు, కర్రి వెంకట కృష్ణారెడ్డి, వీసం నాగలక్ష్మి, బొర్రా శ్రీనివాసరావు, చిమటా బాలాజీ, దొంతిబోయిన కొండలురెడ్డి, లుక్కా బాపనయ్య, తదితరులు పాల్గొన్నారు.
సూపర్ సిక్స్ అడిగితే నాలుక కోస్తాననటం చంద్రబాబు అహంకారానికి నిదర్శనం వైఎస్సార్ సీపీ బాపట్ల జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మేరుగ నాగార్జున గుళ్లపల్లిలో ‘బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ’ పాల్గొన్న సమన్వయకర్తలు డాక్టర్ గణేష్, వరికూటి అశోక్‌బాబు