
ఒరిగిన అమరేశ్వరాలయ రాజగోపురం తలుపు
అమరావతి: ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన అమరావతి అమరేశ్వరస్వామి దేవస్థానం దక్షిణరాజగోపురానికి అమర్చిన రెండు తలుపుల్లో ఒక తలుపు పక్కకు ఒరిగిపోయింది. బుధవారం రాత్రి దేవాలయ భద్రతా సిబ్బంది తలుపులు మూస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనపై ఆలయ కార్యనిర్వాహణాధికారి రేఖ మాట్లాడుతూ రాజగోపుర తలుపు మరమ్మతుల కోసం చర్యలు తీసుకుంటున్నామన్నారు. గతంలో వేగంగా వచ్చిన ఓ కారు తలుపును ఢీ కొట్టటం వల్ల ఇసుపరాడ్ వంకర వచ్చిందన్నారు. ఈతరహా తలుపులు మరమ్మతులు చేసే వడ్రంగ నిపుణులను పిలిపించటానికి ఏర్పాట్లు చేశామని రెండుమూడు రోజులలో మరమ్మతులు పూర్తి చేస్తామన్నారు. అప్పటివరకు గాలిగోపురం వద్ద సిబ్బందిని ప్రత్యేకంగా నియమించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చూస్తామన్నారు. అలాగే పోలీసుల సహకారంతో మరమ్మతులు పూర్తయ్యే వరకు రక్షణ కల్పిస్తామని తెలిపారు.
నేడు భూ సమీకరణ
గ్రామ సభలు
తాడికొండ: తాడికొండ మండలం దామరపల్లి, ఫణిదరం, బండారుపల్లి గ్రామాల్లో భూ సమీకరణ కోసం ఎమ్మెల్యే అధ్యక్షతన శుక్రవారం గ్రామ సభలు నిర్వహించనున్నట్లు తాడికొండ తహసీల్దార్ మెహర్ కుమార్ గురువారం తెలిపారు. ఉదయం 9 గంటలకు ఫణిదరం, 11 గంటలకు దామరపల్లి, 12 గంటలకు బండారుపల్లి గ్రామాల్లో గ్రామ సభ జరగనుంది. రైతులు హాజరై తమ అభిప్రాయాలను తెలియజేయాలని ఆయన సూచించారు.
సీఎస్ సమీక్షకు
హాజరైన కలెక్టర్
నరసరావుపేట: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ గురువారం రాష్ట్ర సచివాలయం నుంచి నిర్వహించిన వీడియా సమావేశానికి పల్నాడు జిల్లా కలెక్టర్ పి.అరుణ్‌బాబు, జేసీ సూరజ్ గనోరే కలెక్టరేట్ నుంచి వర్‌ుచ్యవల్‌గా హాజరయ్యారు. పీ–4, పాజిటివ్ పబ్లిక్ పెర్సప్సన్, మహిళా స్వయం శక్తి సంఘాలకు వార్షిక క్రెడిట్ లైవ్లీహుడ్ యాక్షన్ ప్లాన్, మైక్రో క్రెడిట్ ప్లాన్, పోషణ్ ట్రాకర్, బాల సంజీవని లబ్ధిదారుల ఫేషియల్ అథంటికేషన్, కంప్రెస్‌డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ప్రాజెక్టు, సోలార్ ప్రాజెక్టులకు భూసేకరణ, రుతుపవన సన్నాహక చర్యలు, అంశాలపై సమీక్ష చేశారు. దీనిలో కలెక్టర్‌తో పాటు డీఆర్‌ఓ ఏకా మురళి, సీపీఓ శ్రీనివాసమూర్తి, పలువురు జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
రేవుల్లో పడవలు
తిప్పుకొనేందుకు వేలం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని కృష్ణానది రేవుల్లో పడవలు, బల్లకట్టు తిప్పుకొనేందుకు గురువారం జెడ్పీ డిప్యూటీ సీఈఓ సీహెచ్ కృష్ణ అధ్యక్షతన సీల్డ్ టెండరు, బహిరంగ వేలం నిర్వహించారు. ఆరు రేవులకు వచ్చే ఏడాది మార్చి 31 వరకు పడవలు, బల్లకట్టు తిప్పుకొనేందుకు హక్కుల కల్పిస్తూ సీల్డ్ టెండరు, బహిరంగ వేలంలో అచ్చంపేట, అమరావతి మండలాల్లోని నాలుగు రేవులను పాటదారులు దక్కించుకున్నారు. మాచవరం, కొల్లిపర మండలాల్లోని రేవులకు జరిగిన వేలంలో ఎవరూ పాల్గొనకపోవడంతో వాటిని వాయిదా వేశారు.
డిజాస్టర్ మేనేజ్‌మెంట్‌పై శిక్షణ
తాడేపల్లి రూరల్: తాడేపల్లి పట్టణ పరిధిలోని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయాన్ని వివిధ రాష్ట్రాల అధికారులు గురువారం సందర్శించినట్లు సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దీపక్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సౌత్‌క్యాంపస్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ సిస్టమ్స్‌పై నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో భాగంగా పలు రాష్ట్రాల నుంచి నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ డిప్యూటీ కమాండెంట్లు, ఆయా రాష్ట్రాల రెవెన్యూ అధికారులు విచ్చేశారని తెలిపారు. రేపీ ఎస్‌టీఎంఏ టెక్నికల్ ఎక్స్‌పర్ట్ తిరుమల కుమార్, కెపాసిటీ బిల్డింగ్ ఆఫీసర్ తనూజ, జీఐఎస్ ఎక్స్‌పర్ట్ హరీష్, ప్రాజెక్ట్ మేనేజర్లు బస్వంత్, కిషోర్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

ఒరిగిన అమరేశ్వరాలయ రాజగోపురం తలుపు

ఒరిగిన అమరేశ్వరాలయ రాజగోపురం తలుపు