వారఫలాలు (అక్టోబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 31వరకు)

Weekly Horoscope From  October 25th To October 31 2020 - Sakshi

మేషం: (అశ్వని, భరణి, కృత్తిక 1 పా.)
కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి గతం కంటే మరింత మెరుగ్గా  ఉంటుంది. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. విలువైన వస్తువులు, భూములు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. కాంట్రాక్టర్లు అనుకున్న పనులు దక్కించుకుంటారు. వ్యాపారాలు కొంతమేర విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. పారిశ్రామికవర్గాలకు ఉత్సాహవంతమైన సమయం. వారం మధ్యలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. గులాబీ, తెలుపు రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. లక్ష్మీ నృసింహస్తోత్రాలు పఠించండి.

వృషభం: (కృత్తిక 2,3,4 పా, రోహిణి, మృగశిర 1,2 పా.)
కొన్ని పనులు చకచకా పూర్తి కాగలవు. అనుకున్న ఆదాయం సమకూరి అవసరాలు తీరతాయి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. నూతన వ్యక్తుల పరిచయం. అందరిలోనూ గౌరవమర్యాదలు పొందుతారు. గతంలోని సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. విద్యార్థులకు నూతనోత్సాహం. ప్రముఖులతో పరిచయాలు.  గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు మరింత విస్తరిస్తారు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు కొంత తగ్గి ఊరట చెందుతారు. రాజకీయవర్గాలకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. వారం ప్రారంభంలో బంధువుల నుంచి ఒత్తిడులు. స్వల్ప అనారోగ్యం.  ఎరుపు, నేరేడురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. ఆంజనేయ దండకం పఠించండి.

మిథునం: (మృగశిర 3,4, ఆరుద్ర, పునర్వసు 1,2,3 పా.)
ఆర్థిక ఇబ్బందులు కొంతమేర తీరతాయి. ఆప్తులు, మిత్రులతో మరింత ఉత్సాహంగా గడుపుతారు. యుక్తితో కొన్ని ఇబ్బందుల  నుంచి బయటపడతారు. ఎదురుచూస్తున్న ఉద్యోగావకాశాలు దగ్గరకు వస్తాయి. ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి.  వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుతాయి. ఉద్యోగాలలో సత్తా చాటుకుంటారు. కళారంగం వారికి అనుకున్న అవకాశాలు దక్కే సూచనలు. వారం  మధ్యలో ధనవ్యయం. ఇంటాబయటా ఒత్తిడులు.  పసుపు, లేత ఆకుపచ్చరంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుధ్యానం చేయండి.

కర్కాటకం: (పునర్వసు 4 పా., పుష్యమి, ఆశ్లేష)
చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగించినా అవసరాలు తీరతాయి. ప్రముఖులను కలుసుకుని కీలక  విషయాలు చర్చిస్తారు. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. పాత విషయాలు కొన్ని  గుర్తుకు తెచ్చుకుంటారు. ఊహించని కాంట్రాక్టులు దక్కించుకుంటారు. విద్యార్థులకు కొంత అనుకూల పరిస్థితి ఉంటుంది. ఆలయాలు సందర్శిస్తారు. తెలివిగా కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు క్రమేపీ అనుకూలిస్తాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు. పారిశ్రామికవర్గాల యత్నాలలో  పురోగతి కనిపిస్తుంది. వారం మధ్యలో ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం.  ఆకుపచ్చ, నీలంరంగులు. ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. శివపంచాక్షరి పఠించండి.

సింహం: (మఖ, పుబ్బ, ఉత్తర 1 పా.)
బంధువులు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఇంతకాలం పడిన శ్రమ కొలిక్కి వస్తుంది. వ్యతిరేకులు కూడా అనుకూలురుగా మారి చేయూతనందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు మరింత అనుకూలిస్తాయి. కాంట్రాక్టర్లకు శుభవార్తలు. అందరిలోనూ సత్తా చాటుకుని మంచి గుర్తింపు పొందుతారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు.  వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో గందరగోళం తొలగుతుంది.. రాజకీయవర్గాల యత్నాలు కొలిక్కి వస్తాయి. వారం చివరిలో కుటుంబంలో సమస్యలు ఆకుపచ్చ, పసుపు  రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. నవగ్రహస్తోత్రాలు  పఠించండి.

కన్య: (ఉత్తర 2,3,4 పా, హస్త, చిత్త1,2 పా.)
ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. సోదరులు, మిత్రులతో ముఖ్య  విషయాలపై చర్చిస్తారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. కొన్ని సమస్యలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. శుభకార్యాలపై చర్చలు సాగిస్తారు. ఎంతటి వారినైనా వాగ్ధాటితో ఆకట్టుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు అనుకూల సమాచారం. వ్యాపారాలు విస్తరించి లాభాల దిశగా సాగుతారు. ఉద్యోగాలలో  ప్రోత్సాహకరంగా ఉంటుంది.  పారిశ్రామికవర్గాలకు శ్రమపడినా ఫలితం దక్కుతుంది. వారం  చివరిలో వృథా ఖర్చులు. ఇంటాబయటా సమస్యలు.æనీలం, లేత ఆకుపచ్చరంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

తుల: (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పా.)
దీర్ఘకాలికంగా వేధిస్తున్న  సమస్య నుంచి గట్టెక్కే సూచనలు. ఆర్థిక లావాదేవీలు మరింత పుంజుకుంటాయి. ఇతరులకు సైతం చేయూతనందించి ప్రశంసలు పొందుతారు. నిరుద్యోగులకు ఉపయుక్తమైన సమాచారం అందుతుంది. కొన్ని శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు మరింత సాఫీగా సాగి లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో మీ హోదాలు కొంత పెరిగే సూచనలు. రాజకీయవర్గాలకు నూతనోత్సాహం. వారం ప్రారంభంలో కుటుంబసభ్యులతో వివాదాలు. ధనవ్యయం.  నేరేడు, గులాబీరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. హనుమాన్‌ చాలీసా పఠించండి.

వృశ్చికం: (విశాఖ 4 పా., అనూరాధ, జ్యేష్ఠ)
కొత్త వ్యక్తులు పరిచయమవుతారు. అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. యుక్తి, పట్టుదలతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. వాహనాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కొంత కాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. కాంట్రాక్టర్లకు కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులకు మరింత ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగి తగినంత లాభాలు పొందుతారు. పారిశ్రామికవర్గాలకు అనూహ్యమైన ప్రగతి కనిపిస్తుంది. వారం మధ్యలో స్వల్ప అనారోగ్యం. మానసిక అశాంతి.  ఎరుపు,  తెలుపు రంగులు, ఉత్తరదిశ ప్రయాణాలు అనుకూలం. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.

ధనుస్సు: (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 పా.)
ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. రుణాలు కూడా చేయాల్సివస్తుంది. ఆరోగ్యంపై కొంత  శ్రద్ధ అవసరం.  మిత్రులతో మాటపట్టింపులు. కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పరుస్తాయి.  శ్రమ తప్ప ఆశించిన ఫలితం కనిపించదు. భూవివాదాలు  చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  స్థిరాస్తి వివాదాలు సవాలుగా నిలుస్తాయి.  వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగాలలో  కొత్త విధులు కొంత ఇబ్బందిగా మారవచ్చు. రాజకీయవర్గాలకు  కొన్ని విమర్శలు ఎదురై  నిరుత్సాహపడతారు. వారం మధ్యలో శుభవార్తలు. వాహనయోగం. ధనలబ్ధి.  ఎరుపు, తెలుపురంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం. ఈశ్వరారాధన∙మంచిది.

మకరం: (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ఠ 1,2 పా.)
కొత్త పనులు చేపట్టి సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలలో పురోగతి కనిపిస్తుంది. రుణాలు తీరి ఊరట చెందుతారు. పరపతి కలిగిన వారితో పరిచయాలు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇంటి నిర్మాణయత్నాలలో పురోగతి సాధిస్తారు. ప్రముఖుల నుంచి  ఆహ్వానాలు అందుతాయి.   కొన్ని శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులు కాస్త ఊరట చెందుతారు. వ్యాపారాలు మరింత పుంజుకుంటాయి. ఉద్యోగాలలో  గందరగోళ పరిస్థితులు తొలగుతాయి. కళారంగం వారికి ఒత్తిడులు తొలగుతాయి. వారం చివరిలో వ్యయప్రయాసలు. ఇంట్లో వివాదాలు.  ఎరుపు, చాక్లెట్‌రంగులు, తూర్పుదిశ ప్రయాణాలు అనుకూలం. ఆదిత్య హృదయం పఠించండి.

కుంభం: (ధనిష్ఠ 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3 పా.)
కొత్త  పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు మరింత సంతృప్తినిస్తాయి. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. ఆలయాలు సందర్శిస్తారు. ఒక సమాచారం నిరుద్యోగులకు సంతోషం కలిగిస్తుంది. దూరపు బంధువులతో ముఖ్య విషయాలు చర్చిస్తారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. కొంతకాలంగా చికాకు పరుస్తున్న కొన్ని సమస్యలు తీరి ఉపశమనం పొందుతారు.  వ్యాపారాలలో కొత్త భాగస్వాములు చేరతారు.  ఉద్యోగాలలో బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.  పారిశ్రామికవర్గాలకు అనుకోని ఆహ్వానాలు. వారం  ప్రారంభంలో ఆరోగ్య సమస్యలు. వృథా ఖర్చులు. గులాబీ, పసుపురంగులు, దక్షిణదిశ ప్రయాణాలు అనుకూలం. దత్తాత్రేయ స్తోత్రాలు పఠించండి.

మీనం: (పూర్వాభాద్ర 4 పా., ఉత్తరాభాద్ర, రేవతి)
ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉండి రుణాలు తీరతాయి. ముఖ్యమైన పనులు నిదానించినా  ఎట్టకేలకు పూర్తి కాగలవు. మిత్రులు,  ఆప్తులతో ఆనందాన్ని పంచుకుంటారు. కుటుంబసభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. గత సంఘటనలు గుర్తుకు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం కొంత మందగిస్తుంది.  ఇంటి నిర్మాణాల్లో కదలికలు ఉంటాయి.  వ్యాపారాలలో లాభాలు పొందుతారు.  ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు. రాజకీయవర్గాలకు మరింత ఉత్సాహవంతమైన కాలం. వారం చివరిలో కొన్ని సమస్యలు వేధిస్తాయి. ధనవ్యయం.  గులాబీ, ఆకుపచ్చరంగులు, పశ్చిమదిశ ప్రయాణాలు అనుకూలం.  కాలభైరవాష్టకం పటించండి..

-సింహంభట్ల సుబ్బారావు
జ్యోతిష్య పండితులు 

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top