Daily Horoscope: ఈ రాశివారు సన్నిహితులతో జాగ్రత్త! | Horoscope Today: 11 September 2023 In Telugu - Sakshi
Sakshi News home page

నేటి రాశిఫలం: ఈ రాశివారు సన్నిహితులతో జాగ్రత్త!

Sep 11 2023 6:50 AM | Updated on Sep 11 2023 8:17 AM

Today Horoscope in Telugu Daily Horoscope 11 09 2023 - Sakshi

గ్రహఫలం సోమవారం, 11.09.23
శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, నిజ శ్రావణ  మాసం,
సూర్యోదయం :    5.50
సూర్యాస్తమయం    :  6.04


తిథి: బ.ద్వాదశి రా.12.04 వరకు
తదుపరి త్రయోదశి,
నక్షత్రం: పుష్యమి రా.9.29 వరకు
తదుపరి ఆశ్లేష,


వర్జ్యం: లేదు,
దుర్ముహూర్తం: ప.12.20 నుండి, 1.11 వరకు,
తదుపరి ప.2.47 నుండి 3.36 వరకు,
రాహుకాలం : ఉ.7.30 నుండి 9.00 వరకు
యమగండం :  ఉ.10.30 నుండి 12.00 వరకు 


అమృతఘడియలు: ప.2.30 నుండి 4.15 వరకు.


మేషం: ఆదాయవ్యయాలు సమానంగా ఉంటాయి. బంధువర్గం నుండి ఒత్తిడులు. ఆలోచనలు పరిపరివిధాలుగా ఉంటాయి. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

వృషభం: కష్టానికి ఫలితం దక్కుతుంది. వ్యవహారాలలో విజయం. ఆస్తులు కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల నుండి శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

మిథునం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. శ్రమ తప్పకపోవచ్చు. సోదరులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజంలో విశేష గౌరవం. భూములు, వాహనాలు కొంటారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

సింహం: సన్నిహితులతో జాగ్రత్త.. వివాదాలు తలెత్తవచ్చు. దూరప్రయాణాలు. ఆస్తుల కొనుగోలులో అవాంతరాలు. బాధ్యతలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

కన్య: నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు. ఆలయ దర్శనాలు. కుటుంబంలో శుభకార్యాలు. ఆకస్మిక ధనలబ్ధి. వ్యాపార, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

తుల: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు కొన్ని వసూలవుతాయి. వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రోత్సాహాన్నిస్తాయి.

వృశ్చికం: కొత్త రుణాలు చేస్తారు. ఆత్మీయులతో మాటపట్టింపులు. దైవదర్శనాలు. కుటుంబంలో గందరగోళం. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.

ధనుస్సు: కష్టానికి తగిన ఫలితం దక్కదు. సోదరులు, మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

మకరం: పరిచయాలు పెరుగుతాయి. ఆత్మీయుల నుండి ధనలబ్ధి. కీలక నిర్ణయాలు. పనుల్లో విజయం. వ్యాపార, ఉద్యోగాలు మరింత పుంజుకుంటాయి.

కుంభం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. ముఖ్య నిర్ణయాలు. ఆస్తులు సమకూరతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

మీనం: మిత్రులతో విరోధాలు. ప్రయాణాలలో మార్పులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలు కొంత మందగిస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement