
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, తిథి: శు.నవమి పూర్తి (24గంటలు), నక్షత్రం: రోహిణి ఉ.10.16 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: సా.4.17 నుండి 5.59 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.44 నుండి 9.28 వరకు, తదుపరి రా.10.59 నుండి 11.46 వరకు, అమృతఘడియలు: రా.2.33 నుండి 4.16 వరకు; రాహుకాలం: ప.3.00 నుండి 4.30 వరకు, యమగండం: ఉ.9.00 నుండి 10.30 వరకు, సూర్యోదయం: 6.24, సూర్యాస్తమయం: 601.
మేషం: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు శ్రమాధిక్యం. వ్యాపారాలలో కొంత నిరాశ. ఉద్యోగాలలో మార్పులు ఉండవచ్చు.
వృషభం: నూతన ఉద్యోగప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో కొత్త ఆశలు.
మిథునం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసమస్యలు వేధిస్తాయి. బంధువులతో తగాదాలు. వ్యాపారాలలో కొంత గందరగోళం. ఉద్యోగాలలో పనిభారం.
కర్కాటకం: సన్నిహితుల సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. వ్యాపారాలలో ప్రోత్సాహం. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలగుతాయి.
సింహం: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. భూవివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలలో అనుకూల పరిస్థితి. ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
కన్య: పరిస్థితులు అనుకూలించవు. అనుకోని ధనవ్యయం. కుటుంబసమస్యలు. అనారోగ్యం. మిత్రులతో అకారణంగా తగాదాలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగమార్పులు.
తుల: మిత్రులతో వివాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వ్యాపారాలలో భాగస్వాములతో విభేదాలు. ఉద్యోగమార్పులు.
వృశ్చికం: పనుల్లో పురోగతి. కుటుంబంలో శుభకార్యాలు. గృహయోగం. కొత్త వ్యక్తుల పరిచయం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.
ధనుస్సు: చిరకాల మిత్రుల కలయిక. విందువినోదాలు. పనులు విజయం. ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు కలిసివస్తాయి. ఉద్యోగాలలో పురోగతి. దైవదర్శనాలు.
మకరం: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధువులతో తగాదాలు. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు ముందుకు సాగవు. వ్యాపారాలలో చిక్కులు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.
కుంభం: మిత్రులతో కలహాలు. పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ తప్పదు. ప్రయాణాలలో ఆటంకాలు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో సమస్యలు.
మీనం: పనుల్లో పురోగతి. కుటుంబసమస్యల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. భూలాభాలు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలలో పురోభివృద్ధి. ఉద్యోగాలలో మరింత అనుకూలం.