
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి బ.దశమి రా.12.44 వరకు, తదుపరి ఏకాదశి నక్షత్రం రేవతి ఉ.10.14 వరకు, తదుపరి అశ్వని, వర్జ్యం... లేదు. దుర్ముహూర్తం ఉ.9.51 నుండి 10.44 వరకు, తదుపరి ప.3.05 నుండి 3.55 వరకు, అమృతఘడియలు... ఉ.7.46 నుండి 9.24 వరకు, తిరిగి రా.3.33 నుండి 5.12 వరకు.
సూర్యోదయం : 5.30
సూర్యాస్తమయం : 6.33
రాహుకాలం : ప.1.30 నుంచి 3.00 వరకు
యమగండం : ఉ.6.00 నుంచి 7.30 వరకు
మేషం: వ్యవహారాలలో ప్రతిబంధకాలు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆలోచనలు స్థిరంగా సాగవు. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.
వృషభం: పరిస్థితులు అనుకూలిస్తాయి. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. బాకీలు వసూలవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
మిథునం: యత్నకార్యసిద్ధి. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ముందడుగు.
కర్కాటకం: శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. కొన్ని నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. శ్రమ మరింత పెరుగుతుంది. ప్రయాణాలలో అవాంతరాలు. రుణయత్నాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా ఉంటాయి.
కన్య: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. పరపతి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.
తుల: నూతన విద్యావకాశాలు. ప్రముఖులతో పరిచయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.
వృశ్చికం: విచిత్ర సంఘటనలు. పనుల్లో అవాంతరాలు. బాధ్యతలు అధికమవుతాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ పరుస్తాయి.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యవహారాలలో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఒప్పందాలు రద్దు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
మకరం: ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. సన్నిహితులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వ్యాపారాలలో అభివృద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
కుంభం: పనుల్లో అవాంతరాలు. రుణభారాలు. మిత్రులతో కలహాలు. కుటుంబంలో సమస్యలు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పకపోవచ్చు.
మీనం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. పనులలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.