ఇవాల్టి దినఫలాలు: ఈ రాశివారికి వ్యాపార, ఉద్యోగాల్లో సానుకూలత

Today Horoscope 18 10 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు ఆశ్వయుజ మాసం,

తిథి: బ.అష్టమి ఉ.9.44 వరకు
తదుపరి నవమి,
నక్షత్రం: పుష్యమి పూర్తి (24గంటలు)

వర్జ్యం: ప.1.14 నుండి 3.01 వరకు,
దుర్ముహూర్తం: ఉ.8.14 నుండి 9.03 వరకు,
తదుపరి రా.10.31 నుండి 11.21 వరకు

అమృతఘడియలు: రా.11.51 నుండి 1.37 వరకు.

సూర్యోదయం :    5.56
సూర్యాస్తమయం    :  5.34

రాహుకాలం :  ప. 3.00 నుంచి 4.30 వరకు
యమగండం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు 

మేషం: ఎంత శ్రమపడ్డా పనులు ముందుకు సాగవు. ఆలోచనలు ఎటూ తేలవు. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త వివాదాలు.

వృషభం: సన్నిహితుల నుండి ధనలాభం. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశ్చర్యకరమైన మార్పులు.

మిథునం: మిత్రులతో కలహాలు. రుణబాధలు తప్పవు. అనారోగ్యం. దూరప్రయాణాలు. వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు.

కర్కాటకం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల ద్వారా శుభవార్తలు. వాహనాలు కొంటారు. పరిస్థితులు మరింత సానుకూలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఇబ్బందులు అధిగమిస్తారు. 

సింహం: కుటుంబంలో కొన్ని సమస్యలు చికాకు పరుస్తాయి. ప్రయాణాలలో మార్పులు. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.

కన్య: వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అ«ధిగమిస్తారు.

తుల: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలకు హాజరవుతారు. వాహనసౌఖ్యం. కీలక నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశించినవిధంగా ఉంటాయి.

వృశ్చికం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆశ్చర్యకర సంఘటనలు. మానసిక ఆందోళన. వ్యాపారాలు, ఉద్యోగాలు అంతగా కలసిరావు.

ధనుస్సు: వ్యవహారాలలో అవాంతరాలు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బంది.

మకరం: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల నుండి ముఖ్య సందేశం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ ఆశలు నెరవేరతాయి.

కుంభం: పరిచయాలు మరింత పెరుగుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆరోగ్యం కొంత కుదుటపడుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

మీనం: వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. ఆస్తి ఒప్పందాలు వాయిదా వేస్తారు. రుణయత్నాలు సాగిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఆదుర్దా.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top