ఈ రాశి వారికి అన్నింటా విజయం.. ధన, వస్తు లాభం

Today Horoscope 14 10 2022 - Sakshi

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, తిథి: బ.పంచమి తె.4.02 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: రోహిణి రా.9.14 వరకు, తదుపరి మృగశిర, వర్జ్యం: ప.12.28 నుండి 2.23 వరకు తిరిగి తె.3.20 నుండి 5.04 వరకు (తెల్లవారితే శనివారం) దుర్ముహూర్తం: ఉ.8.15 నుండి 9.04 వరకు, తదుపరి ప.12.11 నుండి 12.56 వరకు, అమృతఘడియలు: సా.5.47 నుండి 7.30 వరకు. 

సూర్యోదయం :    5.55
సూర్యాస్తమయం    :  5.38
రాహుకాలం : ఉ.10.30 నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: పనుల్లో అవాంతరాలు. కుటుంబబాధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు కొంత నిరుత్సాహపూరితంగా ఉంటాయి.

వృషభం: కొన్ని పనులు శ్రమానంతరం పూర్తి. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆత్మీయులు దగ్గరవుతారు. స్థిరాస్తివృద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది.

మిథునం: ఇంటాబయటా సమస్యలు. ఏ పని చేపట్టినా నెమ్మదిగా సాగుతుంది. బంధువులతో వైరం. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుస్తాయి. మీలోని ప్రతిభ మరింత వెలుగులోకి వస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

సింహం: అనుకున్న ఉద్యోగాలు లభించే సమయం. ఆప్తుల సలహాలు పొందుతారు. ఆస్తులు కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలస్థితి.

కన్య: పనుల్లో పొరపాట్లు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆస్తుల వ్యవహారాలలో చిక్కులు. కష్టమే తప్పితే ఫలితం ఉండదు. వ్యాపారాలు, ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి.

తుల: రాబడి కంటే ఖర్చులు పెరుగుతాయి. పనుల్లో సందిగ్ధత. కీలక నిర్ణయాలలో మార్పులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

వృశ్చికం: కుటుంబంలో ఒత్తిడులు తొలగుతాయి. ఆప్తులు సహాయపడతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పేరుగడిస్తారు.

ధనుస్సు: చేపట్టిన వ్యవహారాలలో విజయం. శుభవార్తలు. ధన, వస్తులాభాలు. పరపతి పెరుగుతుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

మకరం: కుటుంబంలో కలహాలు. కొత్త రుణాలు చేయాల్సివస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. స్థిరాస్తి వివాదాలు. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

కుంభం: ప్రయాణాలు గందరగోళంగా ఉంటాయి. అనుకోని ఖర్చులు. బాధ్యతలు అధికమవుతాయి. శ్రమ తప్పదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మీనం: సన్నిహితులతో సఖ్యత. కుటుంబంలో సంతోషకరంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. భూములు కొంటారు. ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఉత్సాహం.

Read latest Astrology News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top