Horoscope Today: February 17, 2023 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి

Published Fri, Feb 17 2023 6:27 AM

Horoscope Today 17 02 2023 - Sakshi

శ్రీ శుభకృత్‌నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు మాఘ మాసం, తిథి: బ.ద్వాదశి రా.8.39 వరకు, తదుపరి త్రయోదశి నక్షత్రం: పూర్వాషాఢ సా.5.46 వరకు, తదుపరి ఉత్తరాషాఢ వర్జ్యం: రా.1.16 నుండి 2.44 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.46 నుండి 9.33 వరకు, తదుపరి ప.12.35 నుండి 1.23 వరకు అమృతఘడియలు: ప.1.16 నుండి 2.46 వరకు.

సూర్యోదయం :    6.30
సూర్యాస్తమయం    :  5.57
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: బంధువర్గంతో వివాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ముఖ్యమైన వ్యవహారాలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభం: చిత్రమైన సంఘటనలు. పనుల్లో అవాంతరాలు. ఆకస్మిక ప్రయాణాలు. దైవదర్శనాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం.

మిథునం: కొత్త పనులు చేపడతారు. ఊహించని ధనలాభం. దూరపు బం«ధువుల కలయిక. వాహనయోగం. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.

కర్కాటకం: చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల పరిచయం. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడుల నుంచి బయటపడతారు.

సింహం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు. వ్యయప్రయాసలు. ధనవ్యయం. కుటుంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత చికాకులు.

కన్య: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులలో విభేదాలు. ఆర్థిక పరిస్థితి అంతగా అనుకూలించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

తుల: కొత్త విషయాలు తెలుస్తాయి. ఆర్థిక విషయాలలో మెరుగుదల. పనులలో విజయం. శుభవార్తలు అందుతాయి. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సానుకూలమవుతాయి.

వృశ్చికం: పనుల్లో తీవ్ర జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశాజనకంగా ఉంటాయి.  ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి మార్పులు.

ధనుస్సు: వ్యవహారాలలో విజయం. శుభవార్తలు వింటారు. బంధువులతో సఖ్యత. కీలక నిర్ణయాలు. వాహనయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహం.

మకరం: వ్యయప్రయాసలు. బం««ధువుల నుంచి ఒత్తిడులు. పనులు మ«ధ్యలో వాయిదా పడతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు. ఉద్యోగ మార్పులు.

కుంభం: శుభకార్యాలు నిర్వహిస్తారు. సంఘంలో గౌరవం. ఆస్తిలాభం. బాకీలు కొన్ని వసూలవుతాయి. వ్యాపారాలలో పురోగతి. ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలిస్తాయి.

మీనం: కొత్త విషయాలు గ్రహిస్తారు. సమాజంలో గౌరవం. ఆస్తిలాభం. యత్నకార్యసిద్ధి. పనులు చకచకా సాగుతాయి. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement