Horoscope Today: February 15, 2023 In Telugu - Sakshi
Sakshi News home page

ఈ రాశివారు ఆసక్తికర సమాచారం వింటారు..

Feb 15 2023 6:41 AM | Updated on Feb 15 2023 8:34 AM

Horoscope Today 15 02 2023 - Sakshi

శుభవార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది.

శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘ మాసం, తిథి: బ.దశమి రా.12.55 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం: జ్యేష్ఠ రా.8.37 వరకు, తదుపరి మూల, వర్జ్యం: తె.4.11 నుండి 5.52 వరకు (తెల్లవారితే గురువారం), దుర్ముహూర్తం: ప.11.51 నుండి 12.35 వరకు, అమృతఘడియలు: ప.12.10 నుండి 1.40 వరకు; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 6.32, సూర్యాస్తమయం: 5.57. 

మేషం: కుటుంబసభ్యులతో విభేదిస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. స్వల్ప అనారోగ్యం, వైద్యసలహాలు పొందుతారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మార్పులు.

వృషభం: శుభవార్తలు వింటారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ధన, వస్తులాభాలు. పాతమిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ప్రగతి ఉంటుంది.

మిథునం: కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులతో సఖ్యత. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీదే పైచేయిగా ఉంటుంది. 

కర్కాటకం: కొత్త రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. బంధువులతో చర్చలు. స్వల్ప అనారోగ్యం, వైద్యసేవలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

సింహం: వ్యవహారాలలో కొంత జాప్యం. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సామాన్యమే. ఉద్యోగాలలో ఒత్తిడులు పెరుగుతాయి.

కన్య: ఆసక్తికర సమాచారం. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. పరిచయాలు విస్తృతమవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఉన్నతస్థితి. దైవదర్శనాలు.

తుల: పనుల్లో ప్రతిష్ఠంభన. వైద్యసలహాలు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

వృశ్చికం: సన్నిహితులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొత్త ఆశలు.

ధనుస్సు: చిత్రవిచిత్ర సంఘటనలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు కొంత మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరుత్సాహం. ఉద్యోగయత్నాలు కొంత ఫలిస్తాయి.

మకరం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో వివాదాలు. శ్రమకు ఫలితం స్వల్పమే. ధనవ్యయం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత గందరగోళం. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి.

కుంభం: ఇంట్లో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో వివాదాలు తీరతాయి. విందువినోదాలు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

మీనం: బంధుమిత్రులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక చింతన. ఆకస్మిక ప్రయాణాలు. కొత్తగా రుణాలు చేస్తారు. వ్యాపారాలలో కొన్ని అవాంతరాలు. ఉద్యోగాలలో పనిఒత్తిడులు పెరుగుతాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement