
రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు
కురబలకోట ; కురబలకోట మండలం ముదివేడు మార్గంలో శనివారం బైక్‌ను బొలెరో వాహనం ఢీకొన్న సంఘటనలో ఆరుగురు గాయపడ్డారు. అంగళ్లులో గొర్రెల సంతలో గొర్రెలు విక్రయించి బొలెరో వాహనంలో పెద్దమండ్యం, ముసలికుంటకు వెళుతుండగా ముదివేడు ఫారెస్టు మార్గంలో ఎదురుగా వచ్చిన బైక్‌ను ఢీకొంది. హఠాత్తుగా బ్రేఽక్ వేయడంతో బొలెరా వాహనం కూడా బోల్తాపడింది. ఈ ఘటనలో బొలెరో లోని దట్టెనాయక్ తాండాకు చెందిన కృష్ణా నాయక్ (60), బాలాజీ నాయక్ (30), బండ్రేవు లక్ష్మయ్య (50), ముసలికుంట మల్‌రెడ్డి (45), రామాంజనేయ రెడ్డి (28)గాయపడ్డారు. బైక్‌లో వస్తున్న గాలివీడు ప్రాంతం బలిజ పల్లెకు చెందిన మహేష్ (32) కూడా గాయపడ్డారు. వీరిని హుటాహుటిన 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసు స్టేషన్‌లో నిర్బంధించి దురుసుగా ప్రవర్తించారు
మదనపల్లె సిటీ : గౌతమ బుద్ధుని తల నరికిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నిరసనదీక్ష చేస్తుంటే ఎస్పీ ఆదేశాలతో పోలీసు స్టేషన్‌కు తరలించి దురుసుగా ప్రవర్తించారని భారతీయ అంబేద్కర్ సేన (బాస్) వ్యవస్థాపకుడు పీటీఎం శివప్రసాద్ ఆరోపించారు. జిల్లా ఎస్పీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. శనివారం స్థానిక బెంగళూరు రోడ్డులో దీక్ష శిబిరం వద్దకు పోలీసులు వద్దకు వచ్చి దురుసుగా ప్రవర్తించి బలవంతంగా నెట్టివేశారన్నారు. దీంతో ఎడమ మోకాలిపై గాయమైందన్నారు. అనంతరం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. శివప్రసాద్‌ను బాస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు గణపతి, పాలకుంట శ్రీనివాసులు, ముత్యాల మోహన్, బాస్ నాయకులు ఆస్పత్రికి వచ్చి పరామర్శించారు.

రోడ్డు ప్రమాదంలో ఆరుగురికి గాయాలు