
హంసవాహనంపై సౌమ్యనాథుడు
నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మూడోరోజు ఆదివారం ఉదయం పల్లకీసేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథుడు మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని అర్చకులు సునీల్‌కుమార్, పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్‌కుమార్, మనోజ్‌కుమార్, సాయిస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాత్రి హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారంలో స్వామివారు దేవేరులతో కలిసి మాడవీధుల్లో విహరించారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగో రోజు సోమవారం ఉదయం పల్లకీసేవ, తిరుమంజనం, రాత్రికి సింహ వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్‌స్పెక్టర్ దిలీప్‌కుమార్ తెలిపారు.
●తొలి ఏకాదశిని పురస్కరించుకొని సౌమ్యనాథ స్వా మి ఆలయం భక్తులతో కిటకిటలాడింది.భక్తులు స్వా మివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.

హంసవాహనంపై సౌమ్యనాథుడు