
రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు
సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై శనివారం మోటకట్ల సమీపంలో కారు– ఆటో ఢీ కొన్న ప్రమాదంలో నలుగురికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు... మండల పరిధిలోని శెట్టిపల్లె గ్రామానికి చెందిన జయనారాయణరెడ్డి, అలివేలమ్మ, రెడ్డెమ్మలు సొంత పనుల నిమిత్తం కారులో రాయచోటి వెళుతుండగా మోటకట్ల మిట్ట సమీపంలోకి రాగానే ఎదురుగా ఆటో రావడంతో అదుపు తప్పి రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ జాన్‌తో పాటు కారులో ఉన్న ముగ్గురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
టపాసులు పేల్చిన కేసులో విచారణ
లక్కిరెడ్డిపల్లి : టపాసులు పేల్చిన సంఘటనలో లోకేష్ అనే వ్యక్తి జాతీయ మానవహక్కుల కమిషన్‌కు చేసిన ఫిర్యాదు మేరకు శనివారం తిరుపతి సీఐడీ ఎస్పీ శ్రీనివాసులు విచారణ చేపట్టారు. తమ సిబ్బందితో కలిసి మండలంలోని కుర్నూతల అగ్రహారంలో గ్రామస్తులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సీఐ కొండారెడ్డి, ఎస్‌ఐ రవీంద్రబాబు, వీఆర్‌ఓలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.