
ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య
పీలేరు రూరల్ : ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన శనివారం రాత్రి పీలేరు పట్టణం రాజీవ్ నగర్ కాలనీలో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. రాజీవ్‌నగర్ కాలనీకి చెందిన షేక్ మస్తాన్ (30) యమహా షోరూంలో పని చేస్తున్నాడు. తరచూ బంధువులతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన నివాసంలో చీరతో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.
కుక్కల దాడిలో జింకకు గాయాలు
తంబళ్లపల్లె : కుక్కల దాడిలో కృష్ణ జింక తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం సాయంత్రం జరిగింది. బెంగళూరు ఎన్.మల్లికార్జునరెడ్డి బండ్రేవు వద్ద ఉన్న తన తోట నుంచి స్వగ్రామం గోపిదిన్నెకు వస్తుండగా రోడ్డు పక్కన రెండు ఊర కుక్కలు కృష్ణ జింకపై దాడి చేయడం గమనించాడు. వెంటనే కుక్కల బారి నుంచి జింకను కాపాడి తన తోట వద్దకు తీసుకెళ్లారు. ఈ విషయాన్ని ఫారెస్టు బీట్ ఆఫీసర్ రామరాజ్. వెటర్నటీ డాక్టర్ ఇందులకు సమాచారం అందించారు. శనివారం ఉదయం వారు 104 పశువైద్య అంబులెన్స్‌లో సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన జింకకు చికిత్స చేశారు. తీవ్ర గాయాలు కావడంతో అదే అంబులెన్స్‌లో మదనపల్లె పశువైద్యశాలకు తరలించారు.
గంజాయి విక్రేత అరెస్టు
సిద్దవటం : కడప నగరం శంకరాపురం ప్రాంతానికి చెందిన రెడ్డి సురేష్ అనే వ్యక్తి గంజాయి విక్రయిస్తుండగా అరెస్టు చేసినట్లు ఒంటిమిట్ట సీఐ బాబు తెలిపారు. సిద్దవటం పోలీసు స్టేషన్‌లో శనివారం సీఐ మాట్లాడుతూ సిద్దవటం మండలం భాకరాపేటలో గంజాయి అమ్ముతున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. దీంతో తమ సిబ్బందితో వెళ్లి అక్కడి మూడు రోడ్లు కూడలిలో గంజాయి విక్రయిస్తున్న రెడ్డి సురేష్‌ను అదపులోకి తీసుకొని అతని వద్దనుంచి 1కిలో 200 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితుడు రెడ్డిసురేష్‌ను విచారించగా విశాఖపట్టణం సమీపంలోని చింతపల్లి గ్రామంలో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి వైఎస్సార్ కడప జిల్లా పరిసర ప్రాంతాలలో గంజాయిని ఎక్కువ ధరకు విక్రయించేవాడని తెలిసిందన్నారు. ఈ మేరకు నిందితుడిని సిద్దవటం కోర్టులో హాజరు పరచగా జడ్జి 15 రోజులు రిమాండుకు ఆదేశించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో సిద్దవటం ఎస్‌ఐ మహమ్మద్‌రఫీ, పోలీసులు పాల్గొన్నారు.
భర్తపై వేధింపుల కేసు నమోదు
ముద్దనూరు : మండలంలోని పెనికలపాడు గ్రామానికి చెందిన నాగవేణి అనే మహిళ తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. నాగవేణికి కడపకు చెందిన వెంకటసుబ్బయ్యతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన అతను గత 2 సంవత్సరాల నుంచి వేధిస్తున్నాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య

ఉరి వేసుకుని యువకుడి ఆత్మహత్య