LVM3-M3 Launch: CM Jagan Congratulates ISRO Team - Sakshi
Sakshi News home page

LVM3-M3 Launch: ఇస్రో బృందాన్ని అభినందించిన సీఎం జగన్‌

Mar 26 2023 11:29 AM | Updated on Mar 26 2023 3:02 PM

GSLV Mark 3 MK3 launch: Cm Jagan Congratulates Isro Team - Sakshi

ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ ప్రయోగం విజయవంతం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

సాక్షి, తాడేపల్లి: ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ ప్రయోగం విజయవంతం పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. భవిష్యత్‌లో ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని సీఎం జగన్‌ ఆకాంక్షించారు. భారత అంతరిక్ష చరిత్రలో ఈ రోజు ఒక ముఖ్యమైన మైలురాయిగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ ట్వీట్ చేశారు.

కాగా, ఎల్‌వీఎం3–ఎం3 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. అంతరిక్ష ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా భారత్‌ అవతరించింది. ఈ ప్రయోగం ద్వారా యూకేకు చెందిన నెట్‌వర్క్‌ యాక్సెస్‌ అసోసియేట్‌ లిమిటెడ్‌ కంపెనీ, భారత్‌కు చెందిన భారతి ఎంటర్‌ప్రైజెస్‌ సంయుక్తంగా వన్‌వెబ్‌ ఇండియా–2 పేరుతో రూపొందించిన 5,805 కిలోల బరువు కలిగిన 36 ఉపగ్రహాలను భూమికి 450 కిలోమీటర్ల ఎత్తులోని లియో ఆర్బిట్‌లో 87.4 డిగ్రీల వంపులో వృత్తాకార కక్ష్యలోకి ప్రవేశట్టారు.
చదవండి: సంతోష సూచీలో మనమెక్కడ.. మనకంటే మెరుగైన స్థానాల్లో పాక్, శ్రీలంక

ప్రయోగాన్ని 19.7 నిమి­షాల్లో పూర్తి చేశారు. నాలుగేసి ఉపగ్రహాల చొప్పున.. 9 విడతలుగా కక్ష్యలో ప్రవేశపెట్టారు. పూర్తి స్థాయి వాణిజ్యపరంగా న్యూ స్పేస్‌ ఇండియా లిమిటెడ్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ స్పేస్‌ కలిసి వన్‌వెబ్‌ పేరుతో చేసిన రెండో ప్రయోగమిది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement