సరస్వతీ నిలయంపై ‘ఈనాడు’ విషం

రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలపై తప్పుడు కథనం
అసౌకర్యాలంటూ వక్రీకరణలు
రూ.80 లక్షలతో నాడు – నేడు పథకంలో స్కూలు అభివృద్ది
1200 మందికి సరిపడే స్కూలు
ఇందులో ఏ పాఠశాలా విలీనం కాలేదు
అతి పెద్ద డైనింగ్ హాలు దీని సొంతం
ఏ అసౌకర్యమూ లేని స్కూలు ఇది
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాష్ట్ర ప్రభుత్వంపై నిత్యం విషం చల్లే దుష్ట చతుష్టయం సరస్వతీ నిలయాలైన పాఠశాలలనీ వదలడంలేదు. ప్రభుత్వ పాఠశాలలను కార్పోరేట్ స్కూళ్లకు దీటుగా తీర్చిదిద్దడాన్ని చూసి ఓర్వలేక పోతోంది. ‘నాడు – నేడు’ పథకం ద్వారా అన్ని సౌకర్యాలతో రూపుదిద్దుకున్న రాజమహేంద్రవరంలోని ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలపై ‘ఈనాడు’ కక్కిన విషం ఎల్లో మీడియా అక్కసుకు అద్దం పట్టింది. సమీపంలోని పాఠశాలను ఈ స్కూల్లో విలీనం చేయడంతో విద్యార్థినుల సంఖ్య 450 మంది 750 మందికి పెరిగిపోయిందని ఓ తప్పుడు రాత రాసింది. భోజనం చేసేందుకు కూడా పిల్లలు ఇబ్బందులు పడుతున్నారంటూ రాసుకొచ్చింది. పిల్లలంతా కలిసి ఒకే చోట కూర్చుని భోజనం చేస్తుంటే దాన్ని వక్రీకరించింది. భోజనశాలలో విశాలంగా ఉన్న ప్రాంతాన్ని వదిలి బాలికలు గుంపుగా కూర్చున్న ఫొటో తీసి తప్పుడు కథనాన్నిచ్చింది.
ఇదీ వాస్తవం
ఈ పాఠశాల జిల్లాలోనే అతి పెద్దది. చంద్రబాబు హయాంలో మూలన పడిన ఈ స్కూలు నాడు – నేడు పథకం ద్వారా రూ.80 లక్షలతో రూపు రేఖలు మార్చుకుంది. 30 గదులతో విశాలంగా ఉంటుంది. దీనిలో 1,200 మంది వరకు చదువుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న విద్యార్దినుల సంఖ్య 700 మాత్రమే. ఇంకా 500 మందికి సరిపడా సౌకర్యాలు ఉన్నాయి. 1 నుంచి 10వ తరగతి వరకు ఎప్పటి నుంచో ఉన్న స్కూలు ఇది. దీనిలో ఎటువంటి పాఠశాలను విలీనం చేయలేదు. అయినా విలీనమంటూ ఈనాడు తప్పుడు కథనం ప్రచురించింది. చాలా తక్కువ స్కూల్స్‌లో మాత్రమే ఉండే అతి పెద్ద భోజనశాల దీనిలోఉంది. ఒకేసారి 600 మంది వరకు కూర్చుని భోజనం చేయవచ్చు. ఒకేచోటు కూర్చున్న వారి చిత్రాన్ని ప్రచురించి, మిగతా ప్రాంతాన్ని వదిలేసి అసౌకర్యమనే కథ అల్లింది.
జిల్లాలోనే నెంబర్ వన్ స్కూలు
ఈ స్కూల్లో మరో పాఠశాలను విలీనం చేశారన్న కథనం చాలా తప్పు. ఏ పాఠశాలనూ విలీనం చేయలేదు. నాడు – నేడు నిధులతో మరిన్ని సౌకర్యాలు కల్పించాం. ఇక్కడ అతి పెద్ద భోజనశాల ఉంది. రక్షిత మంచి నీటి సౌకర్యం, మంచి టాయిలెట్లు ఉన్నాయి. పెద్ద స్కూలు గ్రౌండ్ ఉంది. ఆడపిల్లలకు రక్షýణగా స్కూలు అంతా గ్రిల్స్ ఏర్పాటు చేశాం. ఎటువంటి అసౌకర్యాలు లేవు. ఒక స్కూలుకు ఏ సౌకర్యాలు అవసరమో అవన్నీ ఉన్న పాఠశాల ఇది.
– ఎస్.అబ్రహాం, జిల్లా విద్యాశాఖాధికారి. తూర్పుగోదావరి జిల్లా