పిల్లలు లేరా.. అయితే ఉందిగా ఒక మార్గం!  

Cara Website Portal: Child Adoption Process - Sakshi

నెహ్రూనగర్‌(గుంటూరు జిల్లా): పండంటి బిడ్డ కోసం పెళ్లయిన దగ్గర నుంచి దంపతులంతా  తాపత్రయపడుతుంటారు. అయితే, ప్రస్తుత యాంత్రిక జీవనంలో దాన్ని నోచుకోక ఎంతో మంది ఆవేదనకు గురవుతున్నారు. పిల్లలు పుట్టడం కష్టతరమవుతుంది. కొంత మంది ఎంతో ఖర్చుపెట్టి కృత్రిమంగా పిల్లల్ని కంటున్నారు. మరికొంత మంది అదీ కూడా అవకాశం లేక అల్లాడుతున్నారు. అటువంటి వారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చిన్నారుల దత్తత కార్యక్రమాన్ని గత కొన్ని సంవత్సరాలుగా అమలు చేస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకుందాం. 
చదవండి: సీతా ఫలంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

2011 సంవత్సరం నుంచి అందుబాటులోకి దత్తత  
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 2011 నుంచి చిన్నారుల దత్తత కార్యక్రమాన్ని ప్రారంభించాయి. ఇందుకోసం కొన్ని నియమ, నిబంధనల్ని ఏర్పాటు చేశాయి.  ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు 149 మంది చిన్నారుల్ని స్వదేశంలో, ఏడుగురిని ఇతర దేశాల వారికి అధికారులు దత్తత ఇచ్చారు. చిన్నారుల్ని దత్తతకు ఇచ్చేటప్పుడు అన్ని నియమ, నిబంధనలకు లోబడి అర్హత కలిగిన దంపతులకు మాత్రమే అప్పగిస్తారు.

ఇలా దరఖాస్తు చేసుకోవాలి  
దత్తత తీసుకునే దంపతులు  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న www.cara. nic.in అనే వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
వెబ్‌ సైట్‌లోకి వెళ్ళి న్యూ రిజి్రస్టేషన్‌ అనే ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. 
బేసిక్‌ ఇన్‌ఫార్మేషన్‌ ఇవ్వాలి( వయస్సు, పెళ్లి తదితర వివరాలు) 
దంపతుల్లో ఎవరిదో ఒకరి పాన్‌కార్డ్‌తో రిజిస్టర్‌ అయిన వెంటనే యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ (మెయిల్‌కి, మొబైల్‌) వస్తుంది. 
యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్‌ అయిన తరువాత తగిన ధ్రువ పత్రాలైన రెసిడెన్స్‌ సరి్టఫికెట్, బర్త్‌ సరి్టఫికెట్‌(10వ తరగతి మార్క్‌ లిస్ట్, 10లోపు చదివిన వారైతే స్టడీ సర్టిఫికెట్స్‌), ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఉద్యోగి అయితే జీతం సరి్టఫికెట్, ఇతరులైతే 1.50లక్షకు పైగా పత్రం పొందాల్సి ఉంటుంది), పెళ్లి సరి్టఫికెట్, డాక్టర్‌ సర్టిఫికెట్‌ ( ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధులు, ప్రాణాంతకరమైన వ్యాధులుగాని లేవని ఎంబీబీఎస్‌ రిజిస్టర్డ్‌ డాక్టర్‌ నుంచి) తీసుకోవాలి. –దంపతులిద్దరూ కలిసి దిగిన ఫోటోల్ని వెబ్‌సైట్‌లో ఆప్‌లోడ్‌ చేయాలి.   
తరువాత ఈ వివరాలన్నీ మహిళా, శిశు సంక్షేమ శాఖ లాగిన్‌లోకి వెళతాయి. 
ఇచ్చిన వివరాలు సక్రమంగా ఉన్నాయా...లేవా? అని శిశు సంక్షేమ శాఖ నుంచి ప్రత్యేకంగా కేటాయించిన సిబ్బంది దంపతుల ఇంటికి వెళ్లి విచారణ(హోం స్టడీ) చేపడతారు.  
అంతా సక్రమంగా ఉంటే ఆ వివరాల్ని ఐసీడీఎస్‌ పీడీ లాగిన్‌కి వెళుతుంది.  
అక్కడ నుంచి వారి సీనియార్టీ ప్రకారం చిన్నారుల్ని దత్తత ప్రక్రియ ప్రారంభమవుతుంది. 
అర్జీదారు కోరుకున్న బిడ్డను రిఫర్‌ చేస్తూ వారి మొబైల్‌కు సమాచారం అందుతుంది. ఆ సమాచారం మేరకు 48 గంటల్లో కారా వెబ్‌ సైట్‌లో లాగిన్‌ అయి సదరు బిడ్డ నచ్చితే రిజర్వు చేసుకోవాల్సి ఉంటుంది. 
రిజర్వు చేసుకున్న బిడ్డను ఇరవై రోజుల్లోపు పోలికలు సరిపోల్చుకుని బిడ్డ నచ్చినట్లయితే, దత్తత ఏజెన్సీ వద్దకు వెళ్ళి ఆమోదం తెలియజేసి రూ.40వేల డీడీ సమరి్పంచి పొందవచ్చు.  
బిడ్డను పొందిన వారం రోజుల్లోపు సదరు దత్తత ఏజెన్సీ వారు సమరి్పంచిన ధ్రువపత్రాలన్నింటినీ స్థానిక కుటుంబ న్యాయస్థానంలో సమరి్పంచి కోర్టు ఉత్తర్వుల ప్రతిని అందజేస్తారు. 
ప్రతిది వారి మెయిల్, మొబైల్‌కి ఆప్‌ టూ డేట్‌ కారా వెబ్‌ సైట్‌ నుంచి వస్తూ ఉంటుంది. 
ప్రస్తుతం 2018–19 ఎన్‌రోల్‌ చేసుకున్న వారికి సీనియార్టీ ప్రకారం పూర్తి పారదర్శకంగా పిల్లలను దత్తత కింద అప్పగిస్తున్నారు. 
పిల్లల్ని అప్పగించిన తరువాత కూడా రెండు సంవత్సరాల పాటు దత్తత తీసుకున్న చిన్నారుల్ని శిశు సంక్షేమ శాక అధికారులు పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. 
వయస్సును బట్టి బిడ్డల అప్పగింత 
తల్లిదండ్రుల వయస్సు 55 సంవత్సరాలు మించకూడదు. 
తల్లి, తండ్రి వయస్సు ఇద్దరిది కలిపి 90 సంవత్సరాలుగా ఉంటే(తండ్రికి 50, తల్లికి 40 వయస్సు) 0 నుంచి 4 సంవత్సరాల పాప/బాబు దత్తత ఇస్తారు.  ఇద్దరి వయస్సు కలిపి 100 సంవత్సరాలు ఉంటే 4 నుంచి 8 సంవత్సరాలలోపు పిల్లల్ని  దత్తతకు ఇస్తారు.  
సింగిల్‌ పేరెంట్‌ 45 సంవత్సరాలు కలిగి ఉన్న తండ్రికి మగ బిడ్డను ఇస్తారు. అదే తల్లికి అయితే మగ/ఆడ బిడ్డను దత్తకు ఇస్తారు.

పారదర్శకంగా ప్రక్రియ 
దత్తత ప్రక్రియ అంతా కూడా కారా అనే వెబ్‌సైట్‌ ద్వారా పారదర్శకంగా జరుగుతుంది. పిల్లలు కావాలనుకున్న దంపతులు ఆన్‌లైన్‌లో రిజిస్టర్‌ చేసుకుంటే వారి సీనియార్టీ ప్రకారం 0 నుంచి 18 సంవత్సరాలలోపు వయస్సున్న పిల్లలను దత్తత తీసుకోవచ్చు. జిల్లాలో శిశు గృహాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల్ని పెంచలేము అనే వారు ఇక్కడ అందజేస్తే వారిని దత్తత ఇస్తారు.  
– బి. మనోరంజని, పీడీ, ఐసీడీఎస్‌ గుంటూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top