రసాయనాలతో మాగబెడుతున్న పరిస్థితి | - | Sakshi
Sakshi News home page

రసాయనాలతో మాగబెడుతున్న పరిస్థితి

Apr 15 2026 8:08 AM | Updated on Apr 15 2026 8:08 AM

మామిడి పండ్లు సహజంగా పక్వానికి రాకముందే వ్యాపార ధోరణితో కొందరు త్వరగా మాగేలా కృత్రిమ పక్వం (ఆర్టిఫిషియల్‌ రైపనింగ్‌) చేస్తున్నారు. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. కృత్రిమంగా మాగబెట్టడానికి చాలా మంది కాల్షియం కార్బైడ్‌ వాడుతున్నారు. ఇది తేమ తగిలినపుడు అసిటిలిన్‌ వాయువు విడుదల చేస్తుంది. ఈ వాయువు పండ్లను త్వరగా పసుపు రంగులోకి మారేలా చేస్తుంది. రూ.80 ఖర్చుతో ఒక కిలో కాల్షియం కార్బైడ్‌ ద్వారా 5 నుంచి 10 టన్నుల వరకు మామిడి కాయలను కేవలం 24 గంటల్లోనే మాగబెట్టవచ్చు. ఈ పండ్లను తినడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. తలనొప్పి, వాంతులు, విరేచనాలు, కడుపునొప్పి, చర్మ అలర్జీలు వస్తాయి. దీర్ఘకాలంలో నాడీ వ్యవస్థపై ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులపై అనారోగ్య ప్రభావం అధికంగా ఉంటుంది. క్యాల్షియం కార్బైడ్‌ను నిషేధించినా కొందరు రహస్యంగా వాడుతూనే ఉండడం ఆందోళనకరం.

– ఆర్‌.శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వినియోగదారుల సంఘాల సమాఖ్య

Advertisement
 
Advertisement
Advertisement