బుచ్చెయ్యపేట: భీమునిపట్నం– నర్సీపట్నం(బీఎన్) రోడ్డులో పొట్టిదొరపాలెం వద్ద సోమవారం ఆయిల్‌పామ్ గెలల లోడ్ ట్రాక్టర్ బోల్తా పడింది. రావికమతం మండలం కింతలి నుంచి బుచ్చెయ్యపేట మండలం ఎల్‌బీ పురంలో పామాయిల్ ఫ్యాక్టరీకి ట్రాక్టర్‌పై రైతు ఆయిల్‌పామ్ గెలలు తరలిస్తున్నాడు. ఈ క్రమంలో పొట్టిదొరపాలెం బస్సు షెల్టర్ దగ్గర రోడ్డు గోతుల్లో ట్రాక్టర్ తొట్టె అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో ట్రాక్టర్‌లో ఆయిల్‌పామ్ గెలలన్నీ రోడ్డు పక్కన బురదలో పడిపోయాయి. బోల్తా పడిన ట్రాక్టర్‌ను స్థానికుల సహాయంతో లేపారు. బురదలో పడిపోయిన గెలలను వర్షంలోనే ఎక్కించి ఫ్యాక్టరీకి తరలించడానికి రైతు తీవ్ర అవస్థలు పడ్డాడు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
